ఈటల చేరిక.. బీజేపీలో లొల్లి షురూ

Update: 2021-05-27 13:30 GMT
తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయబడ్డ మాజీ మంత్రి ఈటల రాజేందర్ అడుగులు బీజేపీ వైపు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఓ బీజేపీ జాతీయ నేత సమక్షంలో భేటి అయినట్లు ప్రచారం సాగింది. అయితే ఈటల బీజేపీలో చేరకుండానే ఆ పార్టీలో విభేదాలు భగ్గమన్నాయి. బీజేపీలో ముసలం మొదలైంది.

హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఈటల ఉన్నారు. అదే నియోజకవర్గం నుంచి బీజేపీ నేతగా సీనియర్ నేత పెద్దిరెడ్డి ఉన్నారు. ఈ క్రమంలోనే ఈటల బీజేపీలో చేరబోతున్నట్టు వస్తోన్న వార్తలపై మాజీ మంత్రి ఇనుగాల పెద్ది రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశవారు. ఈటల రాజేందర్ బీజేపీలోకి వస్తే మరో ఉప్పెన తప్పదని ఆయన హెచ్చరించారు.

పెద్దిరెడ్డి మాట్లాడుతూ 'నన్ను సంప్రదించకుండా ఈటల రాజేందర్ ను ఎట్లా బీజేపీలోకి తీసుకుంటారు? ఒక వర్గం వ్యక్తులు మాత్రమే ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఆయనతో సంప్రదింపులు జరిపిన సమయంలో ఒక్కసారి కూడా నన్ను అడగలేదు' అని పెద్ది రెడ్డి ఫైర్ అయ్యారు.

ఢిల్లీ నుంచి ప్రత్యేక విానంలో వచ్చిన చర్చలు జరిపిన నాయకులు నాకు చెప్పడానికి ఏంటి బాధ అని పెద్ది రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లోని వవివేక్ ఫాంహౌస్ లో చర్చలు జరిపితే నేను గుర్తు లేదా? అని నిలదీశారు.ఈటలను పార్టీలోకి ఎలా తీసుకుంటారని.. నన్ను సంప్రదించుకుండా ఎలా ముందుకు వెళతారని పెద్ది రెడ్డి బీజేపీ పెద్దలను ప్రశ్నించారు. పెద్దిరెడ్డి అసమ్మతి గళంతో ఇప్పుడు బీజేపీలో ఈటల చేరిక వివాదం రాజుకుంది.
Tags:    

Similar News