• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవన్ సౌండ్ కి బ్యాక్...

పవన్ సౌండ్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదుర్స్

| జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీటింగ్స్ అంటేనే ఆయన సెన్సేషనల్ కామెంట్స్ ఉంటాయి. అవి ఒక్కసారిగా వైరల్ అవుతాయి.

By - Satya P
Update: 2026-06-22 04:17 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీటింగ్స్ అంటేనే ఆయన సెన్సేషనల్ కామెంట్స్ ఉంటాయి. అవి ఒక్కసారిగా వైరల్ అవుతాయి. అంతే కాదు వైసీపీని ఆయన టార్గెట్ చేస్తే వైసీపీ నుంచి పది గొంతులు లేస్తాయి. ఇలా ఒక వారం పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా రెండూ కూడా షేక్ అయ్యేలా రీ సౌండ్ మోత మోగుతూనే ఉంటుంది. ఇక పవన్ ఆవేశపూరితంగా చెప్పే మాటలు ఆయన స్పీచ్ ని ఇష్టపడే వారు కూడా కోకొల్లలు. ఆయన ఎవరిని విమర్శిస్తున్నారు, ఏమి సందేశం ఇస్తున్నారు అనే కంటే ఆయన వెండితెర మీద ఒక పవర్ ఫుల్ స్టార్ కాబట్టి ఆయన ప్రసంగాలను కూడా ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అందులో విషయం ఉన్నా కూడా వారు చూసేది పవన్ అనే ఒక సినీ ఇమేజ్ ఉన్న నేతను మాత్రమే.

ఆన్ కెమెరా అంటూ :

ఇదిలా ఉంటే కాకినాడలో పవన్ మన వూరు మాటా మంతీ కార్యక్రమంలో మాట్లాడుతూ వైసీపీ మీద నిప్పులు చెరిగారు. ఆయన ఒక హాట్ వార్నింగ్ కూడా వైసీపీకి ఇచ్చారు. అన్ కెమెరాలో చెబుతున్నాను అని తొక్కి నార తీస్తాను అని ఆయన చెబుతున్న మాటలు చేస్తున్న హెచ్చరికలను చూసి ఫ్యాన్స్ అయితే ఇది కదా పవన్ పవర్ అని అనుకుంటున్నారు. అంతే కాదు ఆయన వార్నింగ్ సౌండ్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని యాడ్ చేసి మరీ ఊచకోత అంటూ సోషల్ మీడియా మోతెక్కించేస్తున్నారు.

పవర్ ఫుల్ గానే :

ఇక పవన్ అయితే ఆన్ కెమెరా అంటూ చాలా పవర్ ఫుల్ గానే వార్నింగ్ ఇచ్చారు. సూటిగా స్పష్టంగా ఆయన చెప్పేది ఏంటి అంటే తన టార్గెట్ వైసీపీయే అని. తాను అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీని వదిలేది లేదని అన్నారు. వారిని అసలు స్పేర్ చేసేది లేదని అన్నారు. ఇలా పవన్ చేసిన హాట్ స్పీచ్ కానీ వార్నింగ్స్ కానీ సోషల్ మీడియాలో మాత్రం ఒక రేంజిలో వైరల్ అవుతున్నాయి.

వైసీపీ రియాక్షన్ :

మరో వైపు పవన్ తొక్కి నార తీస్తామన్న దానిని వైసీపీ నేతలు కూడా లైట్ తీసుకుంటున్నారు. ఇవన్నీ విన్నవే చూసినవే అని వారు అంటున్నారు. ఇక పవన్ మీద పిఠాపురంలో పోటీ చేసి ఓటమి పాలు అయిన మాజీ ఎంపీ వంగా గీత అయితే అధికారంలో ఉన్నపుడూ లేనపుడూ వైసీపీ మీదనేనా అంటూ సున్నితంగా పవన్ మీద సెటైర్లు వేశారు. మీరు ప్రజలకు ఏమి చేశారో ముందు చెప్పుకోండి అని సూచించారు. పవన్ కి కుల భావన లేకపోతే పోయింది కానీ కులాన్ని తక్కువ చేసి చూడవద్దు అని ఆమె అన్నారు. పిఠాపురంలో ఎక్కువ మంది కాపులు ఉన్నారు కాబట్టే పవన్ అక్కడ పోటీ చేసేందుకు వచ్చిన సంగతి ఒక్కసారి మననం చేసుకోవాలని అన్నారు.

Tags:    
  • pawankalyan 
  • janasena 
  • ysrcp 
  • andhrapradeshpolitics 
  • kakinada 
  • politicalnews 
  • vangageetha 
  • pithapuram 
  • appolitics 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS