ఉద్యోగుల పోరుబాట..కాగ్నిజెంట్‌కు షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అనుసరిస్తున్న ఐటీ కంపెనీలకు ఉద్యోగుల రూపంలో షాక్ తగలబోతోంది. అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్‌లో ఉద్యోగుల తొలగింపుపై ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. అనైతికంగా తమను ఎలా తొలగిస్తారని టెక్కీలు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై తక్షణమే ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు ప్రొఫెషనల్స్‌తో కలిసి ప్రత్యేక ఐటీఫోరంను ఏర్పర్చుకున్న ఉద్యోగులు కంపెనీపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారు.
కాగ్నిజెంట్ అనుసరిస్తున్న వ్యవహారంపై తెలంగాణ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలకు ఐటీఫోరం పిటిషన్లను అందచేసింది. చెన్నైలోని అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌తోపాటు హైదరాబాద్‌లోని లేబర్ కమిషనర్ వద్ద పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రమాణాలకు తగ్గట్టుగా సిబ్బంది పనితీరు లేదని యాజమాన్యం ఆరోపణలను ఈ ఐటీ ఫోరం తప్పుపట్టింది. మరోవైపు కాగ్నిజెంట్ మాత్రం ఉద్యోగులను తొలగించడం లేదని స్పష్టంచేసింది. కానీ ప్రమాణాలకు అందుకోలేని సిబ్బందిపై వేటు వేసినట్లు కాగ్నిజెంట్ వర్గాలు వెల్లడించాయి. ``కాగ్నిజెంట్ ఇప్పటి వరకు ఏ స్థాయిలో ఉద్యోగులను తొలగించలేదు. ప్రతియేడాది పనితీరుపై సమీక్షిస్తున్నాం.. క్లయింట్ల అవసరాలకు, బిజినెస్ లక్ష్యాలకు సరిపడా నైపుణ్యం ఉద్యోగుల్లో ఉందో లేదా తెలుసుకోవడం కంపెనీ హక్కు ..ప్రస్తుతం ఈ ప్రాసెసింగ్ జరుగుతోంది`` అని ఆ వర్గాలు వెల్లడించాయి.
కాగ్నిజెంట్‌లో ఉద్యోగుల తొలిగింపుపై ఐటీ ఎంప్లాయిస్ ఫోరమ్(ఎఫ్‌ఐటీఈ) దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ఉద్యోగుల తొలిగింపుపై రాష్ట్ర కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు నేడు కంపెనీ ఉన్నతాధికారులతో భేటీ కాబోతున్నారు. ఎఫ్‌ఐటీఈ దాఖలు చేసిన పిటిషన్ అందిందని, రేపు కంపెనీ అధికారులతోపాటు పిటిషనర్లతో సమావేశం కానున్నట్లు జాయింట్ కమిషనర్(లేబర్) ఆర్ చంద్ర శేఖరమ్ తెలిపారు. ``ఇది సాధారణ విషయం..సమస్య వచ్చినప్పుడు ఇలాంటి పిటిషన్లు ఎన్నో అందుకుంటాం..వీటిని పరిష్కరించడానికి మా కృషి చేస్తాం`` అని ఆయన తెలిపారు.