వైఎస్సార్సీపీలో రీజినల్ కో ఆర్డినేటర్స్ ఒక కులం వాళ్లేనా!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రీజినల్ కో ఆర్డినేటర్స్ విషయంలో ఒకే సామాజికవర్గం ఆధిపత్యం కనిపిస్తూ ఉంది. ఆ పార్టీలో ఇప్పటి వరకూ నియమితులు అయిన రీజినల్ కో ఆర్డినేటర్స్ లో ఎక్కువమంది ఒకే కులం వాళ్లు కనిపిస్తూ ఉండటం, కొంతమందికి స్థాయికి మించి బాధ్యతలు అప్పగించడం విశేషం.
ప్రస్తుతానికి అయితే విజయసాయిరెడ్డి రెండు జిల్లాలకు - వైవీ సుబ్బారెడ్డి మరో రెండు జిల్లాలకు - సజ్జల రామకృష్ణా రెడ్డి ఇంకో రెండు జిల్లాలకు రీజినల్ కో ఆర్డినేటర్లుగా ఉన్నారు. వీరంతా జగన్ కు సన్నిహితులుగా పేరు పొందిన వాళ్లు. అయితే వీరిలో పెద్దగా రాజకీయ నేపథ్యం లేని, అనుభవం లేని సజ్జలకు రెండు జిల్లాల బాధ్యతలు ఇవ్వడం ఒకింత విడ్డూరమే.
ఇక మేకపాటి గౌతమ్ రెడ్డి ఒక జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ గా ఉన్నాడు. మిథున్ రెడ్డి మరోజిల్లాకు కో ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇలా స్థూలంగా ప్రధానంగా రెడ్డి సామాజికవర్గం వారే ఈ హోదాల్లో ఉండటం గమనార్హం. పార్టీలోని ఇతర వర్గాల నేతలకు ఈ హోదాల విషయంలో ప్రాధాన్యత లభిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
బీసీలు - కాపుల నేతలకు ఇలాంటి బాధ్యతలు దక్కింది తక్కువే. ఎనిమిది జిల్లాలు ఒకే సామాజికవర్గానికి బాధ్యతలు దక్కాయి. రీజినల్ కో ఆర్డినేటర్స్ మరీ అంత కీలకమైన పదవి ఏమీ కాకపోయినప్పటికీ.. ఇలా ఒకే సామాజికవర్గానికే అధిక ప్రాధాన్యత దక్కుతుండటం మాత్రం చర్చనీయాంశంగా మారుతోంది.