తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బు జమయ్యేది ఎప్పుడంటే?
నవరత్నాలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను సులభంగా అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఫీజు రీయింబర్స్ మెంట్ ను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ఇందులో భాగంగా పిల్లలను కాలేజీలకు పంపించే తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు జమకానున్నాయి. దీనికి ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ముహూర్తం ఖరారు చేశారు. సీఎం వైఎస్ జగన్ గురువారం తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్ తోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏప్రిల్ 9న జగనన్న విద్యాదీవెన కింద ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వనున్నారు. ఏప్రిల్ 27న వసతిదీవెన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సంర్భంగా ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ చేయనున్నారు. దాదాపు 10 లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు గవర్నమెంట్ ఫీజులు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల అకౌంట్లలోకి ప్రభుత్వం జమ చేస్తుంది. తల్లుల ఖాతాల్లో నాలుగు త్రైమాసికాలకు డబ్బు వేస్తారు. తల్లిదండ్రులు మాత్రం కళాశాలలకు వెళ్లి ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇలా చెయ్యడం వల్ల తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లే వీలు ఉంటుందని, ఫీజులు నేరుగా చెల్లించడంవల్ల.. అక్కడ విద్యాబోధన, సౌకర్యాలు, ఇతర వసతుల గురించి తెలుసుకోవడం, పరిష్కారం కాని సమస్యలు ఉంటే అధికారులు దృష్టికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంది. ఏవైనా ఇబ్బందులు ఉంటే పరిష్కారం అధికారులు దృష్టికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది.
రాష్ట్రంలో అర్హులైన విద్యార్థులందరికీ అన్ని కోర్సులకు విద్యా దీవెన కింద ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తుంది. అలాగే వసతి దీవెన పథకం కింద వసతి, భోజన ఖర్చులను ఆర్ధిక సాయం చేస్తుంది. విద్యా దీవెన కింద ఆయా కోర్సులకు చెల్లించాల్సిన ఫీజులను బట్టి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. అలాగే వసతి దీవెన పథకం కింద ప్రతి విద్యాసంవత్సరానికి అయ్యే వసతి, భోజన ఖర్చుల కోసం రూ.20వేలు ఇస్తారు. పాలిటెక్నిక్ కోర్సు చేస్తున్నవారికి రూ.15వేలు, ఐటీఐ కోర్సు చేస్తున్న వారికి రూ.10వేలు ఇస్తారు.
విద్యారంగంలో మరో కీలక నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. అటానమస్ పేరుతో సొంతంగా ప్రశ్నా పత్రాలు తయారు చేసి, అక్రమాలకు పాల్పడే కాలేజీలకు చెక్ పెట్టింది. అటానమస్ కాలేజీలు సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారు చేసుకునే విధానాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇక మీదట నుంచి కాలేజీలకు జేఎన్‌టీయూ ప్రశ్నాపత్రాలే ఉపయోగించాలని సర్కార్ నిర్ణయించింది. అటానమస్ తో పాటు నాన్-అటానమస్ కాలేజీలకు కూడా జేఎన్‌టీయూ ప్రశ్నాపత్రాలే ఉపయోగించనున్నారు. ఇక ప్రశ్నాపత్రాల వాల్యుయేషన్ కూడా జేఎన్‌టీయూకే అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది.