ఆ ప‌ని చేయ‌ను, చేయలేదు: సీఎం ర‌మేశ్

Update: 2015-08-28 04:42 GMT
రాజ‌కీయాల‌ల్లో ఒక్క‌సారిగా తెర‌మీద‌కు వ‌చ్చిన అంశం బ‌ద్ద‌శ‌త్రువులు అయిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ వైసీపీ అధ్యక్షుడు జగన్ మాట్లాడుకోవ‌డం. విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలపై వీరిద్ద‌రు మాట్లాడుకున్నార‌ని....ఇందులో మొద‌ట చొర‌వ తీసుకున్న‌ది సీఎం ర‌మేశ్ అని వార్త‌లు వ‌చ్చాయి. అనంత‌రం జ‌గ‌న్ టీఆర్‌ ఎస్ యువ‌నేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ తో మాట్లాడిన‌ట్లు ఓ ప‌త్రిక‌లో క‌థ‌నం వెలువ‌డింది. అయితే దీనిపై సీఎం రమేశ్ భ‌గ్గుమ‌న్నారు.

"కొంత కాలం కిందట విద్యుత్‌ ఉద్యోగులు ఢిల్లీలో నన్ను కలిశారు. నాతోపాటు మిగిలిన టీడీపీ ఎంపీలను కూడా కలిశారు. వారిని వెంట తీసుకొని కేంద్ర హోం మంత్రి వద్దకు వెళ్లి ఆయనకు సమస్య వివరించాం. ఆ తర్వాత వారెవరూ నా దగ్గరకు రాలేదు. నేను ఎవరికీ ఫోన్లు చేయలేదు  అని తెలిపారు.

"మేం అధికారంలో ఉన్నాం. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నారు. నాకు జగన్‌ తో మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? కడప జిల్లాలో మేం రాజకీయ ప్రత్యర్థులం. నేను ఆయనకు ఫోన్‌ చేయలేదు. మాట్లాడలేదు అంటూ కొట్టిపారేశారు. ఆయనకు నేను ఎందుకు ఫోన్‌ చేస్తాను? ఇది అవాస్తవ ప్రచారం’’ అని రమేశ్ చెప్పారు.

మొత్తంగా శ‌త్రుప‌క్షాలు మాట్లాడిన‌ట్లు వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేద‌ని అందులో కీల‌క‌పాత్ర పోషించిన సీఎం ర‌మేశ్ ఖండించ‌డం...ఈ చ‌ర్చ‌కు ఫుల్ స్టాప్ పెట్టిన‌ట్లా....లేక కొత్త చ‌ర్చ‌కు తెర‌తీసిన‌ట్లా అన్న‌ది చూడాలి
Tags:    

Similar News