కరోనా సెకండ్ వేవ్ పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

Update: 2020-11-19 17:50 GMT
శీతాకాలం వచ్చేసింది. కరోనా మరింత విజృంభిస్తోంది. ఇప్పటికే యూరప్ దేశాలు, అమెరికాను కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. గత ఎండాకాలంను మించి కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే లండన్, ఫ్రాన్స్ లో లాక్ డౌన్ విధించారు. ప్రస్తుతం చలికాలంలో కరోనా విపరీతంగా వ్యాపిస్తుండడంతో యూరప్ సహా అమెరికా వణుకుతోంది. పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి.

శీతాకాలం ప్రారంభమైన సందర్భంగా పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్నాయని ఇప్పటికే వైద్యనిపుణులు ప్రపంచవ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఏపీలో సీఎం జగన్ కరోనా పై కీలక వ్యాఖ్యలు చేశారు. అవిప్పుడు సంచలనమయ్యాయి.

కరోనా సెకండ్ వేవ్ పై ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.చాలా దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ వచ్చిందని.. అక్కడ మొదలు కాగానే.. ఇక్కడా వస్తోందని.. ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం జగన్ సూచించారు.

ఇప్పటికే ఢిల్లీలో లాక్ డౌన్ విధించేందుకు అక్కడి ప్రభుత్వం రెడీ అయ్యిందని.. విదేశాల్లో ఎప్పుడో లాక్ డౌన్ మరోసారి విధించారని జగన్ గుర్తు చేశారు.ఏపీలోకి సెకండ్ వేవ్ రాకముందే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

స్కూళ్లు కాలేజీలు తెరుస్తున్నాం కాబట్టి కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని.. ప్రస్తుతానికి కరోనా పాజిటివ్ కేసులు తగ్గినా సెకండ్ వేవ్ వస్తుంది కాబట్టి కలెక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.
Tags:    

Similar News