సీఎం జిల్లాలో అంత టీడీపీ మాజీ మంత్రిదే!

Update: 2020-08-19 10:50 GMT
వైసీపీ పాలనలోనూ ఇంకా ఆ టీడీపీ మాజీ మంత్రులు, నేతల హవా నడవడం ఏంటని వైసీపీ శ్రేణులు మథనపడుతున్నారు. 10 ఏళ్లు ప్రతిపక్షంలో పోరాడిన తమకు అధికారం దక్కినా.. ఫలితం మాత్రం లేదని ఆవేదన చెందుతున్నారట..

ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా అయిన వైఎస్ఆర్ కడప జిల్లాలో వైసీపీ ఫుల్ స్వీప్ చేసేసింది. మొత్తానికి మొత్తం అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది. కానీ మంత్రి పదవుల్లో ఉపముఖ్యమంత్రి పదవిని ముస్లిం వర్గానికి ఇచ్చారు. కానీ ఆ ముస్లిం మంత్రికి ఎమ్మెల్యేలతో పెద్దగా సంబంధాలు లేవు.

కడప జిల్లా వాసి సీఎం కావడంతో ఎమ్మెల్యేలంతా మంత్రి మీద ఆధారపడకుండా నేరుగా జగన్ దగ్గరికే వెళ్తున్నారు. అయితే సీఎం జగన్.. జమ్మలమడుగు  టీడీపీ మాజీ మంత్రి అయిన రామసుబ్బారెడ్డిని వైసీపీలోకి తీసుకొని ఫుల్ పవర్ ఇచ్చినట్టు సమాచారం.  దీంతో రామసుబ్బారెడ్డి ఇప్పుడు అక్కడ ఆఫీసు తెరిచి ఫుల్ హవా నడిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

అయితే జమ్మలమడుగులో సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా రామసుబ్బారెడ్డి పెత్తనం సాగుతోందని.. అంతా పాత టీడీపీ వాళ్లకే జిల్లాలో.. నియోజకవర్గంలో పనులు, కాంట్రాక్టులు దక్కుతున్నాయని వైసీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామసుబ్బారెడ్డి అసలైన వైసీపీ కోసం కష్టపడ్డ వారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని జిల్లా అంతా చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News