పవన్ కళ్యాణ్ అభిమానికి సీఎం జగన్ ఆర్థికసాయం
జనసేనాని పవన్ కళ్యాణ్ అభిమాని ప్రాణాపాయంలో ఉంటే సీఎం జగన్ స్పందించి ఆదుకున్నారు. పవన్ అభిమాని ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఆదుకోవాలని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పవన్ అభిమాని నాగేంద్ర రక్తసంబంధ వ్యాధితో బాధపడుతున్నాడని.. అతడికి అత్యవసర చికిత్స చేయాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ట్వీట్ చేసింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
జనసేనతోపాటు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్లకు ట్యాగ్ చేశారు. ఈ వార్తపై పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు స్పందించారు. ఈ వార్తను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం జగన్.. పవన్ అభిమానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు సీఎంవో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ ఆస్పత్రికి ఎల్వోసీ జారీ చేశారు. ప్రభుత్వ సాయంతో నాగేంద్రకు చికిత్స జరిగింది. స్టెమ్ సెల్ థెరపీ చేసినట్లు డాక్టర్లు తెలిపారు.
ప్రస్తుతం పవన్ అభిమాని కోలుకుంటున్నట్టు సీఎంవో అధికారులు తెలిపారు. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సైతం ఈ ట్వీట్ పై స్పందించి గూగుల్ పే నంబర్ ఇవ్వాలని తాను సాయం చేస్తానని ట్వీట్ చేశారు.