• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రూ.500 కోసం దారుణంగా...

రూ.500 కోసం దారుణంగా కొట్టాడు .. చివరికి ప్రాణం.. !

By - Tupaki Desk
Update: 2021-08-07 23:30 GMT
డబ్బు అన్నింటికి మూలం. ప్రతి ఒక్కరి జీవితంలో పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు డబ్బే ముఖ్యం. ప్రస్తుత రోజుల్లో మనిషి విలువ కూడా డబ్బుతోనే ముడిపడిపోయింది. మనిషి జీవనం కోసం డబ్బుని సృష్టిస్తే ..ఇప్పుడు అదే డబ్బు కోసం మనిషి మనిషిని చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఎలాంటి బంధాలైనా డబ్బుతోనే ముడిపడుతున్నాయి. డబ్బుతోనే అంతరించిపోతున్నాయి. చివరకు డబ్బు  ప్రాణాలను సైతం తీస్తూ అనేక రకాల సమస్యల సృష్టిస్తోంది. డబ్బే అన్ని రకాల సమస్యల తీసుకొస్తుంది. డబ్బుల కోసం ఇద్దరు మిత్రుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాలు తీసే వరకు వెళ్లింది.

తాజాగా రూ.500 కోసం స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం.. ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. ఈ దారుణ సంఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రూరల్ మండలంలోని మల్లారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 4వ తేదీన మల్లారం కల్లు కాంపౌండ్‌లో జగడం విఠల్, తోట జయకృష్ణ, జగడం గంగారాంలు కల్లు సేవించారు. అయితే, జగడం విఠల్ వద్ద స్నేహితుడు జయకృష్ణ గత కొన్ని రోజుల కిందట రూ.500 అప్పుగా తీసుకున్నాడు.

తాగిన మత్తులో తన డబ్బులు తనకు ఇచ్చేయాలని గొడవకు దిగాడు. అంత వరకు కల్లు కాంపౌండ్ నుండి కదిలేది లేదన్నాడు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో తీవ్ర ఘర్షణ జరిగింది. తోట జయకృష్ణతో పాటు జగడం గంగారాంలు మత్తులో విఠల్‌ ను తీవ్రంగా గాయపరిచారు. విఠల్ కల్లు కంపౌండ్‌ లోనే స్పృహ తప్పి పడిపోయాడు. విఠల్‌ పరిస్థితిని గమనించి కుటుంబ సభ్యులకు స్థానికులు సమాచారం అందించారు. అతన్ని వెంటనే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సన్‌ రైజ్ ఆస్పత్రికి తరలించగా  చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి కుమారుడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags:    
  • death 
  • Political News 
  • Breaking News 
  • Latest News 

Similar News

రాజమండ్రికి 'మహా కుంభమేళా' వైభవం.. గోదావరి పుష్కరాల ప్రత్యేకతలు ఇవే..!

2026-11-25 13:13 GMT

అమెరికా కల ఎంత గొప్పదైనా.. చిన్నారుల ప్రాణాల కంటే గొప్పది కాదు...

2026-11-25 13:13 GMT

పాకిస్తానీ న‌టీన‌టుల‌ను వెంటాడుతున్న ఆప‌రేష‌న్ బొమ్మాళీ

2026-11-25 12:54 GMT

అమెరికా కల చెదిరిందా? భారతీయ టెక్కీల గుండెల్లో ఐబీఎం పెట్టిన 'డిసెంబర్ 31' పిడుగు

2026-11-25 12:51 GMT

ఇంటింటికీ వచ్చి క్షమాపణ చెబుతా: గౌతు శిరీష సంచలన వీడియో

2026-11-25 12:50 GMT

అక్కడి నుంచే పోటీ.. ఆ నియోజకవర్గమే ఎందుకు? కవిత నిర్ణయం వెనుక అసలు కథేంటి?

2026-11-25 12:42 GMT

ఒకే క్లిక్‌తో 10 లక్షల మందికి సందేశం.. టీడీపీని నడిపిస్తున్న డిజిటల్ వెన్నెముక

2026-11-25 12:05 GMT

జ‌న‌సేన 'క‌ట్టు' త‌ప్పుతోంది: సాగ‌దీతే కార‌ణమా.. ?

2026-11-25 12:04 GMT

టీడీపీలో సామాన్య కార్యకర్తలకు పదవులు.. అసలు సీక్రెట్ ఇదే.. పనిచేసిన లోకేశ్ మాస్టర్ ప్లాన్!

2026-11-25 11:01 GMT

10 లక్షల మందితో ‘మైటీడీపీ’ యాప్ సరికొత్త రికార్డు.. లోకేశ్ డిజిటల్ వ్యూహం సక్సెస్!

2026-11-25 10:31 GMT

పింకీ సార్ పింకీ అంతే.. దీని ముందు బాహుబలి బర్రెలన్నీ పక్కకు బలాదూర్

2026-11-25 10:11 GMT

అమెరికాలో పదేళ్లు ఉంటే గ్రీన్‌కార్డా? లక్షలాది వలసదారులకు ఊరటనిచ్చేలా డెమోక్రాట్ల కొత్త బిల్లు

2026-11-25 10:10 GMT

Copyright @2026

Powered by Blink CMS