60లక్షల సిగరెట్ స్కాం..ఇలా బయటపడింది!
లాక్ డౌన్ వల్ల ఎంతో మందికి ఉపాధి పోయింది. ఉద్యోగాలు పోయాయి. కొన్ని చీకటి మాటు వ్యవహారాలు, లంచాలు, మామూళ్లు కూడా ఆగిపోయాయని లేట్ గా తెలిసింది. లాక్ డౌన్ సందర్భంగా చీకటి వ్యాపారాలు చేసే వారి నుంచి వచ్చే మామూళ్లు కొందరు పోలీసులకు ఆగిపోయాయని సమాచారం. రోజువారి మామూళ్లు దక్కక కొందరు గిజగిజలాడిపోతున్నారట.. కక్కుర్తి పడిపోయి దొరికిపోయారు. ఉద్యోగాలు ఊడగొట్టుకుంటున్నారు.
తాజాగా దేశంలో లాక్ డౌన్ వేళ సిగరెట్లు - మద్యంపై నిషేధం విధించారు. అయితే సిగరెట్లు విక్రయించడానికి అనుమతిస్తే ఏకంగా రూ.60 లక్షలు లంచం ఇస్తామని కొందరు డీలర్లు - వ్యాపారులు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
బెంగళూరులో ఈ స్కాం బయటపడింది. ముగ్గురు పోలీస్ అధికారులకు సిగరెట్ విక్రయాల కోసం డీలర్లు రూ.60 లక్షలు ఆఫర్ ఇచ్చారట.. డీల్ కూడా ఓకే అయ్యిందట.. దీంతో లాక్ డౌన్ లో నిబంధనలు ఉల్లంఘించి సిగరెట్లు బ్లాక్ మార్కెట్ కు తరలించేశారట.. ఈ విషయం పోలీస్ ఉన్నతాధికారులకు తెలియడంతో తీగ లాగితే సదురు ముగ్గురు పోలీస్ బాస్ ల కథ బయటపడిందట..
కార్పొరేట్ సిటీ బెంగళూరులో సిగరెట్లు - లిక్కర్ - పాన్ - గుట్కాకు విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ సంస్థలుండే బెంగళూరులో సిగరెట్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. షాపుల్లో సిగరెట్లు ఖాళీ కావడంతో భారీగా రేటు పెట్టి కొనేందుకు ఆర్డర్లు వచ్చాయి. ఒక్కో సిగరెట్ ను రూ.50 కూ విక్రయించారు. అవి కూడా అయిపోవడంతో సిగరెట్ డీలర్లు భారీ మొత్తంలో స్టాక్ ను రిలీజ్ చేయాలని వీటిని తరలించడానికి అనుమతిస్తే రూ.60 లక్షలు లంచం ఇస్తామని బెంగళూరు పోలీసులకు భారీ డీల్ పెట్టారట..
అయితే ముగ్గురు క్రైం బ్రాంచ్ పోలీసులు వీటిని తీసుకొని మరింత డబ్బులు కావాలని వ్యాపారులను డిమాండ్ చేశారు. అక్కడే పోలీసులు, వ్యాపారులకు తేడా వచ్చింది. ఈ విషయం బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ కు వ్యాపారులు ఉప్పందించారు. దీంతో విచారణ జరిపారు.
విచారణలో ముగ్గురు క్రైం బ్రాంచ్ పోలీసులు లంచం తీసుకున్నారని తేలింది. దీంతో ముగ్గురిని సస్పెండ్ చేశారు.ఇలా సిగరెట్ స్కాంలో పోలీసుల కక్కుర్తి వారి ఉద్యోగాలకే ఎసరు తెచ్చింది.