నేలమీద కూర్చుని చిరంజీవి నిరసన

Update: 2016-02-08 10:10 GMT
    ముద్రగడ పద్మనాభం దీక్షకు మద్దతు పలికేందుకు కిర్లంపూడి వెళ్లేందుకు వచ్చిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిలను రాజమండ్రి విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా చిరంజీవి అక్కడే కూర్చుని నిరసన తెలిపారు. విమానాశ్రయం బయట ఆయన చేతికి కట్టుతో నేలపైనే బైఠాయించారు.

కాగా చిరంజీవి పక్కనే ఉన్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరా కొత్త స్టైళ్లో కనిపించారు. ఆయన కూడా తమ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఎప్పుడూ క్లీన్ షేవ్ తో ఉండే ఆయన తెల్లని గడ్డంతో కనిపించారు. ఇటీవల హిమాలయ పర్వతాలకు వెళ్లిన ఆయన అప్పటి నుంచి గడ్డం పెంచేశారు. ఈ స్టైళ్లో ఆయన రజనీకాంత్ లా కనిపిస్తున్నారని పలువురు అక్కడ వ్యాఖ్యానించడం వినిపించింది. సన్నగా, ఇంచుమించు రజనీ ఎత్తులోనే ఉండే రఘువీరా ఇప్పుడు తెల్లని గడ్డం పెంచేటప్పటికి ఆయనలో కొంచెం రజనీకాంత్ పోలికలు కనిపిస్తున్నాయని అనుకోవడం వినిపించింది.

కాగా చిరు, రఘువీరాలు రాజమండ్రి విమానాశ్రయంలో ఉండగానే ముద్రగడ దీక్ష విరమించారు. దీంతో వారిద్దరినీ కాసేపట్లో విడిచిపెట్టేస్తారని తెలుస్తోంది. ముద్రగడ దీక్ష విరమణ నేపథ్యంలో వారు ఎలా స్పందిస్తారో చూడాలి. ముందే నిర్ణయించుకున్న ప్రకారం ముద్రగడను కలుస్తారో లేదంటే దీక్ష విరమించేసినందుకు వెనక్కు వెళ్లిపోతారో చూడాలి.
Tags:    

Similar News