కరోనా వచ్చింది మీ నుంచే.. అమెరికాపై చైనా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Update: 2021-06-05 00:30 GMT
క‌రోనా ఎక్క‌డ పుట్టిందంటే ప్ర‌పంచం మొత్తం చైనా వైపే వేలు చూపిస్తోంది. దీనికి కార‌ణం కూడా అంద‌రికీ తెలిసిందే. కొవిడ్‌-19 తొలి కేసు చైనాలో వెలుగు చూడ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఆ త‌ర్వాతే ప్ర‌పంచానికి విస్త‌రించింది. అయితే.. చైనా మాత్రం త‌న వేలు అమెరికా వైపు చూపిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి అమెరికా నుంచే వ‌చ్చింద‌ని ఆరోపిస్తోంది. అంతేకాదు.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌తో ద‌ర్యాప్తు కూడా చేయించాల‌ని డిమాండ్ చేస్తోంది.

ఈ మేర‌కు చైనా విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి వాంగ్ వెన్సిన్ శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు. అమెరికాలోని ఫోర్ట్ డెట్రిక్ ల్యాబ్ తో స‌హా ప్ర‌పంచంలోని ప‌లు ప్ర‌దేశాల్లో క‌రోనా ఆవిర్భవించిన‌ట్టు అనేక నివేదిక‌లు ఉన్నాయన్నారు. ఈ వైర‌స్ విష‌యంలో త‌మ దేశంపై చేసిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వాల‌ని నిరూపించ‌డానికి తాము ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ద‌ర్యాప్తును స్వాగ‌తించామ‌ని చెప్పారు. ఇప్పుడు అమెరికా కూడా ఇదే విధంగా డ‌బ్ల్యూహెచ్‌వోను త‌మ దేశానికి ఆహ్వానించాల‌ని డిమాండ్ చేశారు.

2019 న‌వంబ‌ర్ లో వుహాన్ లో కొవిడ్ కేసులు బ‌య‌ట‌ప‌డ‌డానికి ముందు.. వైరాల‌జీ ల్యాబ్ లో తొమ్మిది మంది ప‌రిశోధ‌కులు తీవ్ర అనారోగ్యానికి గురైన‌ట్టు అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వెల్ల‌డించాయి. ఈ నేప‌థ్యంలో.. ఆ తొమ్మిది మంది మెడిక‌ల్ రిపోర్టులు బ‌హిర్గ‌తం చేయాల‌ని అమెరికా వైట్ హౌస్ వైద్య స‌ల‌హాదారు ఆంథోనీ ఫౌచీ డిమాండ్ చేశారు.

దీనికి ప్ర‌తిగా చైనా పైవిధంగా స‌వాల్ చేయ‌డం గ‌మ‌నార్హం. క‌రోనా మ‌హ‌మ్మారిపై విజ‌యానికి మాన‌వ‌జాతి స‌మ‌ష్టిగా కృషి చేయాల్సి ఉంద‌న్న వెన్సిన్‌.. త‌న‌పై వ‌చ్చే ఆరోప‌ణ‌ల నిగ్గు తేల్చ‌డానికి ద‌ర్యాప్తు చేయించాల‌ని కోరారు.
Tags:    

Similar News