చైనాలో దురాగతం: దేవుళ్లను తొల‌గించి నేత‌ల ఫొటోలు

Update: 2020-07-23 01:30 GMT
మ‌హ‌మ్మారి వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో చైనా తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. ఆ దేశంలో రోజురోజుకు ప‌రిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ప్ర‌పంచ‌దేశాల ముందు నిందితుడిగా చైనా నిల‌బ‌డుతోంది. రాజ‌కీయంగా.. అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాలో చైనా తీరు అన్ని దేశాలు విమ‌ర్శ‌లు చేస్తున్న ప‌రిస్థితి. ఇప్పుడు తాజాగా మ‌రో వివాదాస్ప‌ద నిర్ణ‌యం తీసుకుని ఆ దేశం ఇరుకున ప‌డింది.

అభివృద్ధి ముసుగులో చైనా ఇప్పుడు కొన్ని తీవ్ర వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు.. దురాగతాలకు పాల్పడుతున్నది. ఆ దేశంలోని మైనారిటీలైన క్రిస్టియన్ల మతాచారాలపై ఆంక్షలు విధించింది. ప్రార్ధ‌న మందిరాలు.. చర్చిల్లో సిలువ గుర్తులు ఉంచరాదని, ఇళ్లల్లో క్రీస్తు ఫొటోలు ఉండకూడదని ఆదేశించింది. వాటి స్థానంలో కమ్యూనిస్ట్ నేతల ఫొటోలు ఉంచాలని చెప్ప‌డంతో ఆ మేర‌కు అక్క‌డి అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. దీంతో చ‌ర్చిలు.. ప్రార్థ‌న మందిరాలు.. ఇళ్ల‌ల్లో క్రైస్త‌వ మ‌తానికి సంబంధించిన ఫొటోలు క‌నిపించ‌డం లేదు. దీంతో అక్కడి మైనారిటీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చైనాలో ఉండటం ఒక నరకంగా మారిందని చెబుతున్నారు.
Tags:    

Similar News