కరోనా కట్టడికి చైనా నూతన ప్రయోగం.. విభజన రేఖపైనే దృష్టి!

Update: 2021-05-11 05:30 GMT
కరోనా మహమ్మారి చైనాలో పుట్టి ప్రపంచ దేశాలకు పాకింది. వైరస్ బారి నుంచి చైనా త్వరగా విముక్తి పొందగలిగినా ఇతర దేశాల పరిస్థితి కాస్త తీవ్రంగానే ఉంది. చైనాలో గతేడాది నుంచి విజృంభించిన వైరస్ క్రమంగా తగ్గుముఖం పట్టింది. వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని అక్కడి ప్రతినిధులు చెబుతున్నారు. కరోనా కట్టడికి చైనా మరో నూతన ప్రయోగం చేపట్టింది. అందుకు ఎవరెస్ట్ శిఖరాన్నే టార్గెట్ చేసింది.

ఎవరెస్ట్ శిఖరంపై విభజన రేఖ ఏర్పాటు చేయాలని డ్రాగన్ దేశం యోచిస్తోంది. నేపాల్ నుంచి వచ్చే పర్వాతారోహకుల వల్ల పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ అధికార ప్రతినిధులు చెబుతున్నారు. ఎవరెస్ట్ అధిరోహించడానికి వచ్చే వారిలో ఎక్కువగా పాజిటివ్ నిర్ధరణ అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఏ ప్రమాణాల ఆధారంగా అనేది ఇంకా స్పష్టత లేదు.
 
చైనాలో ప్రస్తుతం స్థానిక కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. విదేశాల నుంచి వచ్చే వారిలోనే అధికంగా నమోదవుతున్నాయి. పక్కదేశం నేపాల్లో పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఫలితంగా విభజన రేఖ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. టిబెటన్ పర్వతారోహణ మార్గదర్శకుల బృందం ఈ బాధ్యతలు చేపట్టనుందని ఆ దేశ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది.
 
ఎవరెస్ట్ శిఖరం ఉత్తరం వైపున ఈ విభజన రేఖను ఏర్పాటు చేయనున్నారు. నేపాల్ వైపు ఎవరితోనైనా, ఏ వస్తువుతోనైనా సంబంధాలు పెట్టుకోవడాన్ని నిషేధిస్తుంది. భారత, చైనా సరిహద్దుల్లోని ప్రధాన నగరాల్లో లాక్డౌన్ అమలుచేస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ విమానాలు రద్దు చేశారు.
Tags:    

Similar News