సైన్యానికి మ‌ద్ద‌తుగా చైనా ఫోన్ స్టోర్ల పై దాడి!

Update: 2017-07-11 17:08 GMT
భార‌త సైన్యానికి మ‌ద్ద‌తుగా కొంత మంది గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు పుణె - మ‌హారాష్ట్రల‌లో ఉన్న చైనా మొబైల్ ఫోన్ల‌యిన‌ వివో - ఒప్పో స్టోర్ల‌ను ధ్వంసం చేశారు. కొద్ది రోజులుగా భార‌త్ - చైనా ల స‌రిహ‌ద్దులో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డిన నేప‌థ్యంలో ఈ ఘ‌ట‌న జ‌ర‌గడం క‌ల‌క‌లం రేపింది.  స‌రిహ‌ద్దుల వ‌ద్ద ఇరు దేశాలు భారీగా సైన్యాన్ని మోహ‌రించిన సంగ‌తి తెలిసిందే.

భార‌త్ లో చైనా వ‌స్తువుల‌కు డిమాండ్ ఎక్కువ‌. వ్యాపారప‌రంగా చైనాకు భార‌త్ అతి పెద్ద మార్కెట్ ఉన్న దేశం. భార‌త్ లోని వ్యాపార రంగంలో చైనా మొబైల్స్ తో పాటు అనేక ర‌కాల ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులకు మంచి గిరాకీ ఉంది. కొద్ది సంవ‌త్స‌రాలుగా భార‌త్ లో చైనా వ‌స్తువుల వాడ‌కం గ‌ణ‌నీయంగా పెరిగిపోయింది.

షామీ(రెడ్ మీ) - వివో - ఒప్పో వంటి ఫోన్లను చౌక ధ‌ర‌ల‌కే అందించ‌డంతో ప్ర‌జ‌ల్లో వాటికి మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఐపీఎల్ కు వివో మొబైల్ స్పాన్స‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ దాడి ఘ‌ట‌న‌పై నెటిజ‌న్లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. మొబైల్ పోన్లు చైనావైనా, ఆ స్టోర్ల య‌జ‌మానులైన‌ భార‌తీయులకే న‌ష్టం క‌లిగింద‌ని వారు అంటున్నారు. చివ‌రికి ఐ ఫోన్ కూడా చైనాలోనే అసెంబుల్ అవుతుంద‌ని వారు విమ‌ర్శిస్తున్నారు.
Tags:    

Similar News