ఒక అంగుళం వదులుకోం: చైనా మీడియా వ్యాఖ్యలు

Update: 2020-06-17 14:00 GMT
భారత్-చైనా సైనికులు మధ్య ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 20 మంది చనిపోయినట్టు భారత్ ప్రకటించినా.. అటువైపు ఎంత మంది చనిపోయారనే విషయాన్ని చైనా అధికారికంగా ప్రకటించకుండా దాచిపెడుతోంది. తప్పంతా భారత్ దే అంటూ చైనా మీడియా కథనాలు రాస్తోంది.

చైనా అధికారిక పత్రిక పీపుల్స్ డైలీకి చెందిన గ్లోబల్ టైమ్స్ వాస్తవాలను పాతరేసి.. తప్పులను కప్పిపుచ్చుకుంటూ చైనా ప్రజలను మభ్యపెట్టేలా భారత్ పై విషం కక్కింది.

అమెరికా బుట్టలో భారత్ పడిపోయిందని.. భారత్ లో అమెరికా పెట్టే పెట్టుబడుల కారణంగానే భారత్ .. తాజాగా చైనాపై దండెత్తి వస్తోందని చైనా మీడియా ఆడిపోసుకుంది. అమెరికా వల్లే భారత్-చైనా మధ్య సంబందాలు దిగజారుతున్నాయని ఆరోపించింది. భారత్ సరిహద్దుల్లో కవ్విస్తోందని.. కానీ ఎప్పటికీ చైనా గొడవలు సృష్టించబోదని రాసుకొచ్చారు.

దేశ ప్రయోజనాల విషయంలో చైనా రాజీపడదని..సామర్థ్యం, వివేకం.. భారత్ కంటే బలం చైనాకు బాగా ఉందని.. చైనా తన భూమిలో ఒక్క అంగుళం కూడా వదులుకోదు అని.. ప్రతీ అంగుళాన్ని కాపాడుకునే శక్తి చైనాకు ఉందని చైనా అధికారిక మీడియా వెల్లడించింది. అయితే ఘర్షణలో ఎంతమంది చైనా సైనికుల మరణించారనే విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.
Tags:    

Similar News