భారత్ ను చైనా నదులతో ముంచెత్తనుందా?
సిక్కిం దగ్గర చైనా సరిహద్దులో డోక్లాం వివాదంలో యుద్దమంటూ తొడలు గొట్టి తోకముడిచిన చైనా ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేక కుయుక్తులకు పాల్పడుతోంది. బ్రహ్మపుత్ర - సట్లెజ్ నదులను ఇందుకు వాడుకోవాలని చూస్తుండటం గమనార్హం. ఈ రెండు నదులు చైనా నుంచి నేరుగా భారత్ లోకి ప్రవేశిస్తాయి. ఇదే ఇప్పుడే చైనాకు మంచి ఆయుధంగా ఉపయోగపడుతోంది. వాస్తవానికి వరదల సమయంలో ఈ రెండు నదుల మట్టం - ప్రవాహ సమాచారాన్నిమార్పిడి చేసుకునేలా 2006లో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందాన్ని తోసిరాజని భారత్ ను ఇబ్బందుల పాల్జేస్తోంది చైనా. డోక్లాం వివాదాన్ని మనసులో పెట్టుకోవడంతోపాటు తన శత్రు దేశాలైన జపాన్ - అమెరికాలతో భారత్ అంటకాగడం ఆ దేశానికి రుచించడం లేదు. బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు తనను కాకుండా జపాన్ సహాయం తీసుకోవడంపైనా మండిపడుతోంది. భారత్ లో అధ్వాన్న రోడ్లు ఉంటాయని బుల్లెట్ రైలు వల్ల ఆ దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదని తన పెంపుడు పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో కథనాలు వండించి వారుస్తోంది.
ఇకపోతే ఈశాన్య రాష్ట్రాల్లో వరదల వల్ల ఈ ఏడాది ఇప్పటికే 3 కోట్లమంది నష్టపోయారు. ఆ దేశం నుంచి మనదేశంలోకి వచ్చే నదుల సమాచారాన్ని ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. గత నాలుగు నెలల నుంచి ఈ సమాచారాన్ని మనకివ్వడం లేదు. నదుల నీటి మట్టం పెరుగుదలకు సంబందించిన సమాచారాన్ని అందించి ఉంటే ముందుగానే నదీ ప్రవాహ రాష్ట్రాలను - లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరించడం వీలవుతుంది. కానీ భారత్ తనతోపాటు అన్ని రంగాల్లో ఎదగడం సహించలేకపోతున్న డ్రాగన్ కంట్రీ అన్ని రకాలుగా మనల్ని నష్టపరచడానికి ప్రయత్నిస్తోంది. బ్రహ్మపుత్ర మనదేశంలోనే కాకుండా బంగ్లాదేశ్ లో కూడా ప్రవహిస్తోంది. మనకు సమాచారమివ్వకుండా సాకులు చెబుతూ బంగ్లాదేశ్ కు మాత్రం సమాచారం చేరేస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులు కూడా ధ్రువీకరించడం గమనార్హం.
చైనా.. బ్రహ్మపుత్ర నదిపై అనేక ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన జాంగ్మూ ఆనకట్టను నిర్మించింది. ఇంకా అనేక చిన్నా - పెద్ద ప్రాజెక్టులు నిర్మిస్తూ నీటిని నిల్వ చేస్తోంది. మిగులు నీటిని తన అవసరాలకు వాడుకుంటూ.. నీటి ప్రవాహం పెరిగితే చెప్పాపెట్టకుండా కిందకు వదిలి కొన్నిలక్షల మంది భారత ప్రజల ఆస్తి - ప్రాణ నష్టాలకు కారణమవుతోంది. జంతువులకు - పర్యావరణానికి పెద్ద ఎత్తున నష్టం చేకూరుస్తోంది. అంతేకాకుండా తాజాగా టిబెట్ సరిహద్దుతో నేపాల్ వరకు ఉన్నభూభాగంలో యుద్ధ విమానాలు ఆగేలా రోడ్లు పూర్తి చేసింది. ఈ రోడ్డు అరుణాచల్ ప్రదేశ్ కి దగ్గర ఉండటం గమనార్హం. ఇలా భారత్ ను ఇబ్బంది పెట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది చైనా.