చైనాకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాల్సిందేనా?
అనునిత్యం ఏదో ఒకవిధంగా కెలుకుతూ భారత్ ను ఇబ్బంది పెట్టే చైనా.. తాజాగా మరో విపరీత చర్యకు పాల్పడింది. భారత్ ను రెచ్చగొట్టేలా చేస్తూ.. తన తీరును ప్రదర్శించే చైనా.. తాజాగా ఇండియా పరిధిలోని ప్రాంతాలకు తన పేర్లను పెట్టే దుస్సాహసానికి ఒడిగట్టింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో భాగమే అయినా.. తమదంటూ తరచూ తొండి మాటలు చెప్పే చైనా.. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని ఆరు పట్టణాలకు అధికారికంగా పేర్లు పెట్టి భారత్ తో కయ్యానికి కాలు దువ్వింది.
అరుణాచల్ ప్రదేశ్ లోని ఆరు పట్టణాలకు పేర్లు పెడుతూ చైనా ఉత్తర్వులు జారీ చేసినట్లుగా చైనా మీడియా వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్ పై లేనిపోని వివాదాన్ని సృష్టించిన చైనా.. ఆ ప్రాంతం తమదేనంటూ వాదిస్తోంది. దీనిపై భారత్ ఇప్పటివరకూ వెనక్కి తగ్గకుండా.. అరుణాచల్ ప్రదేశ్ పై తనకున్న సార్వభౌమాధికారాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. ఇదిలాఉంటే.. ఈమధ్యన బౌద్ధగురువు దలైలామా.. అరుణాచల్ ప్రదేశ్ పర్యటనను చేయటం తెలిసిందే.
దీనిపై చైనా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటనను నిరసిస్తూ.. భారత దౌత్యవేత్తకు సమన్లు పంపింది. ఇది జరిగిన తొమ్మిది రోజులకు చైనా తనదైన తొండి ఆటకుతెర తీసింది. దక్షిణ టిబెట్ లో తన భౌగోళిక సార్వభౌమత్వాన్ని తెలియజేసేలా అరుణాచల్ ప్రదేశ్ లోని ఆరు పట్టణాలకు పేర్లు పెట్టిన చైనా.. ఆ పేర్లను.. వొగ్యలిన్ లింగ్.. ఖ్యోడెన్ గార్బొ.. మాణిఖ్వా.. బుమొలా.. నామకాపబ్ రీ అని పెట్టింది. అయితే.. ఈ పేర్తు కొత్తవి కావు.
పూర్వకాలంనుంచి ఉన్నా.. తాజాగా వాటిని చైనా గుర్తిస్తూ ప్రకటన జారీ చేసింది. చైనా - భారత్ సరిహద్దులో 3488 కిలోమీటర్ల మేర వాస్తవాధీన రేఖ ఉండగా.. అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్‌గా పేర్కొంటూ.. ఆ ప్రాంతాన్ని తమదేనంటూ చైనా వాదిస్తోంది. 1962 యుద్ధంలోకొంత భాగాన్ని చైనా ఆక్రమించింది. అనంతరం ఇరుదేశాల మధ్య 19సార్లు ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. భారత్ ను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్న చైనాకు షాకివ్వాల్సిన అవసరం ఉంది. లేకుంటే రానున్న రోజుల్లో చైనా మరింతగా చెలరేగిపోవటం ఖాయమని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/