రాందేవ్ బాబాపై చీటింగ్ కేసు

Update: 2020-06-27 10:36 GMT
‘కరోనిల్’ పేరుతో పతంజలి సంస్థ ద్వారా ఇటీవలే కరోనా వైరస్ నివారణ ఆయుర్వేద మందు విడుదలైన సంగతి తెలిసిందే.  ఆ సంస్థ ఎండీ బాలక్రిష్ణ, దాని బ్రాండ్ అంబాసిడర్ రాందేవ్ బాబా విడుదల చేసి తాము కరోనా నివారణ మందు కనుక్కున్నామని వారు ప్రకటించడం వివాదాస్పదమైంది. కేంద్రం ఆ మందును నిషేధించడంతో వీరి బండారం బయట పడింది. అది కరోనా మందు కాదని.. దగ్గు, జలుబు మందు అని తర్వాత పతంజలి సంస్థ బుకాయించింది.

కరోనా మందు పేరు తో ప్రజలను మోసం చేసిన రాందేవ్ బాబా, పతంజలి సీఈవో ఆచార్య బాలక్రిష్ణ, శాస్త్రవేత్త అనురాగ్ వర్షిణీ, నిమ్స్ చైర్మన్ బల్బీర్ సింగ్ తోమన్, నిమ్స్ డైరెక్టర్ అనురాగ్ తోమర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాజస్థాన్ లోని జైపూర్ జ్యోతి నగర్ లో పోలీసులు ఈ కేసు పెట్టారు. బలరాం జాకర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు 420 సెక్షన్ కింద కేసు పెట్టినట్టు తెలిపారు.

ఇక పతంజలి కరోనిల్ విక్రయించవద్దని.. అలా  తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవు అని రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి శర్మ స్పష్టం చేశారు. ఆయూష్ మంత్రిత్వ శాఖ అనుమతి ఈ మందుకు లేదని పేర్కొన్నారు.
Tags:    

Similar News