ఆర్యన్ ను అరెస్టు చేసిన అధికారిని వెంటాడుతున్నారా?
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన ఉన్నతాధికారిపై కొందరు నిఘా పెట్టారా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయనపై గూఢచర్యం జరుగుతుందా? అన్నది ప్రశ్నగా మారింది. ఇదే విషయాన్ని సదరు అధికారి తన ఉన్నతాధికారుల ద్రష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ముంబయి తీరంలోని విలాసవంతమైన క్రూయిజ్ మీద దాడులు నిర్వహించి షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో సహా పలువురు ప్రముఖుల పిల్లల్ని అదుపులోకి తీసుకోవటం.. వారి నుంచి నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవటం తెలిసిందే.
దీంతో.. కొన్ని రోజులుగా రిమాండ్ ఖైదీలుగా జైలుకే పరిమితమవుతున్నారు. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినా వారికి బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానాలు ఓకే చెప్పని పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఈ కేసులకు సంబంధించి దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న ఎన్ సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మీద నిఘా వేశారన్నది ఇప్పుడు తాజా ఆరోపణ.
ఇదే విషయాన్ని తన ఉన్నతాధికారులకు చెప్పిన ఆయన.. తన కదలికలపై కొందరు వ్యక్తులు నిఘా వేసినట్లుగా తాను గుర్తించినట్లు చెప్పారు. ఆయన తరచూ తన తల్లిని పూడ్చిన స్మశానానికి వెళ్లి వస్తుంటారు. ఈ సమయంలో పోలీసు అధికారులమని చెబుతూ తనపై నిఘా వేసిన వైనాన్ని సీసీ పుటేజ్ ద్వారా గమనించినట్లు ఆయన చెబుతున్నారు. అయితే.. వ్యవహారాన్ని మీడియా ముందు మాట్లాడేందుకు ఆయన ఇష్టపడటం లేదు. ఇది చాలా సీరియస్ వ్యవహారంగా ఆయన చెబుతున్నారు. ఇప్పటికే ఆర్యన్ ఖాన్ అరెస్టు వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవటం.. మతాన్ని బయటకు లాగి.. కావాలనే బీజేపీ సర్కారు కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తూ.. ఇలా చేస్తుందన్న ఆరోపణల్ని చేస్తున్నారు. ఇలాంటివేళ.. సదరు దర్యాప్తు అధికారిపై నిఘా వేయటం కొత్త చర్చకు తెర తీసిందని చెప్పాలి.