జ‌య‌రాం హ‌త్య కేసులో నిందితుల లెక్క తేల్చారు!

Update: 2019-06-10 11:43 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌.. ఎక్స్ ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జ‌య‌రామ్ హ‌త్య కు సంబ‌ధించి తాజాగా రెండో చార్జిషీట్ దాఖ‌లు చేశారు. ఇప్ప‌టికే మొద‌టి చార్జి షీట్ ను కోర్టుకు స‌మ‌ర్పించారు. హ‌త్య‌కు కార‌ణంపై తాజాగా క్లారిటీ వ‌చ్చేసింది.

హ‌నీ ట్రాప్ ద్వారానే జ‌య‌రామ్ ను హ‌త‌మార్చిన‌ట్లుగా పోలీసులు త‌మ విచార‌ణ‌లో తేల్చారు. ఈ కేసులో సంబంధం ఉందంటూ పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగిన శిఖా చౌద‌రికి ఎలాంటి సంబంధం లేద‌న్న విష‌యాన్ని పోలీసులు తేల్చ‌టం తెలిసిందే. తాజాగా దాఖ‌లు చేసిన రెండో చార్జిషీట్ లో ఆమెను సాక్షిగా పేర్కొన్నారు.

మొత్తం 23 పేజీల చార్జిషీట్లో 12 మంది నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో ఈ కేసులో మొత్తం 73 మంది సాక్షుల‌ను చేర్చారు. సాక్షుల్లో శిఖా చౌద‌రి.. ఆమె బాయ్ ఫ్‌రెండ్ సంతోష్ రావ్ హ‌నీ ఉన్నారు. ఈ కేసులో మ‌రో ముగ్గురు పోలీసుల‌కు కూడా సంబంధం ఉన్న‌ట్లుగా తేల్చారు. అమ్మాయి ఎర వేసి ర‌ప్పించి.. జ‌య‌రామ్ ను హ‌త్య చేసిన‌ట్లుగా పోలీసులు గుర్తించారు. జ‌య‌రామ్ ను చంపేందుకు వేసిన ప్లాన్ కు సంబంధించిన పూర్తి ఆధారాల్ని పోలీసులు సేక‌రించారు.

ఇక‌.. పోలీసులు నిందితులుగా పేర్కొన్న‌ది ఎవ‌రంటే.. 

A1గా రాకేష్‌ రెడ్డి,
A2గా విశాల్,
A3గా శ్రీనివాస్(వాచ్ మాన్),
A4గా నగేష్(రౌడీషీటర్),
A5గా సూర్య ప్రసాద్ (కమేడియన్),
A6 కిషోర్ (సూర్య ప్రసాద్ స్నేహితుడు),
A7 సుభాష్ రెడ్డి (రియల్ ఎస్టేట్ వ్యాపారి),
A8 బీఎన్ రెడ్డి (టీడీపీ నేత),
A9 అంజిరెడ్డి (రియల్ ఎస్టేట్ వ్యాపారి),
A10 శ్రీనివాసులు (నల్లకుంట మాజీ ఇన్ స్పెక్టర్),
A11 రాంబాబు (రాయదుర్గం మాజీ ఇన్ స్పెక్టర్),
A12 మల్లారెడ్డి (ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ)


Similar News