బాబు మాట్లాడిన ప్రతిసారీ.. జగన్ గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతోందట
ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు కామ్ గా ఉండాలి? అన్న చిన్న విషయాలు కూడా టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబుకు అర్థం కావటం లేదా? అంటే.. అవునన్నమాట వినిపిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన.. తన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడిన ప్రతిసారీ.. అది ఆయనకు మైనస్ గా.. జగన్ కు ప్లస్ గా మారటాన్నిటీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అధినేతకు చెప్పేందుకు ధైర్యం చాలక మిన్నకుండిపోతున్నారు. నిత్యం.. ఏదో అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి.. రచ్చ చేస్తున్న చంద్రబాబు కారణంగా పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందంటున్నారు.
దీనికి తాజా ఉదంతాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ముస్లిం కుటుంబం ఒకటి పోలీసుల వేధింపుల్ని భరించలేక సామూహికంగా సూసైడ్ చేసుకోవటం సంచలనం గా మారింది. ఈ ఎపిసోడ్ పై ప్రాథమిక సమాచారం అందిన వెంటనే స్పందించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విచారణకు ఆదేశించటమేకాదు.. దీని వ్యవహారాన్ని తేల్చేందుకు అత్యుత్తమ స్థాయి అధికారులతో టీం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అందుకు తగ్గట్లే స్పందించిన డీజీపీ సవాంగ్ వెంటనే ఇద్దరు ఉన్నతాధికారులతోకూడిన కమిటీ వేశారు.
వారి ఎంపిక జరిగిన 24 గంటల్లోనే ఈ ఆత్మహత్యలకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్ననంద్యాల వన్ టౌన్ సీఐ.. మరో కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయటమే కాదు.. వారిని అరెస్టు చేశారు. ఒక సంచలన అంశంపై ఏపీ సర్కారు వేగంగా స్పందించటమే కాదు.. అందుకు బాధ్యులైన వారిని జైలుకు పంపింది. ఇక్కడితో ఆగకుండా.. వారికి బెయిల్ రావటాన్ని ప్రశ్నిస్తూ.. కోర్టు పిటిషన్ వేయాలని సీఎం స్వయంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది.
ప్రభుత్వానికి ప్రత్యక్షంగా సంబంధం లేకున్నా.. ఏ మాత్రం ఆలస్యం కాకుండా స్పందించిన జగన్ సర్కారు తీరును ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. ఈ అంశాన్ని పట్టుకొని ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు చంద్రబాబు. సీఎం జగన్ చేతిలో రాష్ట్ర పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని నేరగాళ్ల రాజ్యంగా మార్చారిని.. ఎవరిని స్వేచ్ఛగా బతకనిచ్చేలా లేరని మండిపడ్డారు. కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడటం.. శిరోముండనం లాంటి ఉదంతాలు జగన్ సర్కారులోనే చోటు చేసుకుంటున్నట్లుగా ఆరోపించారు.
నిజానికి ఇలాంటి అర్థం లేని ఆరోపణలే చంద్రబాబు స్థాయిని తగ్గిస్తున్నాయని చెప్పాలి. బాబు ప్రస్తావించిన రెండు ఉదంతాల్లోనూ ప్రజల నుంచి నిరసన రాకుండానే.. ఆ మాటకు వస్తే.. ఈ రెండు ఉదంతాలు సంచలనంగా మారకముందే.. ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవటం కనిపిస్తోంది. అయినప్పటికీ తన రోటీన్ మాటలతో తన స్థాయిని చంద్రబాబు తగ్గించుకుంటుంటే.. అనుకోని రీతిలోచోటుచేసుకున్న ఉదంతాల్లో సీఎం సమర్థవంతంగా స్పందిస్తున్నారన్న కితాబుల్ని సొంతం చేసుకుంటున్నారు. జగన్ లోపాల్ని ఎత్తి చూపించటమే పనిగా పెట్టుకున్న బాబు.. ఆ తొందరలో దిద్దుకోలేని తప్పులు చేస్తున్నారని చెప్పక తప్పదు.