కలాం కోరిక తీర్చిన ఆంద్రప్రదేశ్

Update: 2015-07-28 10:18 GMT
దేశం శిరసు వంచి సలాం చేసే మహనీయుడు కలాం... దేశాన్ని నడిపించడం కాదు ఏకంగా పరుగులు తీయించాడు.. తాను కలలు కని... యువతను కలలు కనేలా చేసి.. ఆ కలలు నిజం చేసుకునే దారులు చూపారు... కడదాక వేలు పట్టి నడిపించిన ఈ జాతి గురువు ఒక్కసారిగా అందరినీ విడిచివెళ్లారు... అయితే... దేశంలోని కోట్టాది మంది యువతకు ఆయన ఇప్పటికే స్ఫూర్తినిచ్చారు. అందరిలా కాకుండా వాస్తవంలో బతికన ఆయన తాను చనిపోతే దేశంలో సెలవు ప్రకటించొద్దని... నా మృతితో విలువైన సమయం వృథా కారాదని ఓ సందర్భంలో చెప్పారు. అయితే... కలాం మృతితో మనసు వికలమైన రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆ మహనీయుడి కోరిక తీర్చింది. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించకపోవడమే కాదు... కలాం స్ఫూర్తితో అదనంగా ఒక గంట పని చేయాలని తన ఉద్యోగులును కోరింది.

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మృతితో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు ప్రకటించలేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు తెలిపారు. దేశానికే స్ఫూర్తిగా నిలిచిన అబ్దుల్‌ కలాం మరణానికి సంతాప సూచికంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు గంట అదనంగా పనిచేయాలని ఐవైఆర్‌ కృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. తాను మరణించాక సెలవు ప్రకటించవద్దని అబ్దుల్‌ కలాం చెప్పిన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో కలాంకు నిజమైన నివాళి అర్పించనట్లయింది.
Tags:    

Similar News