ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత బాబుకు ఉందా?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ పశ్చిమ బెంగాల్ లో చేసిన ప్రకటనపై చంద్రబాబు నాయుడు అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. టీఎంసీ ఎమ్మెల్యేలు నలభై మంది తమతో టచ్లో ఉన్నట్టుగా మోడీ ప్రకటించడం పై బాబు తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యం - విలువలు అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారు.
నిజమే.. మోడీ మాట్లాడింది ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించేలానే ఉంది. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టటం అన్నట్టుగా మోడీ మాట్లాడటం అంత స్వాగతించదగలిగినది కాదు. అక్కడి వరకూ ఓకే కానీ, ఎటొచ్చీ ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు మాట్లాడటమే విడ్డూరంగా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
ప్రత్యేకించి ఫిరాయింపు రాజకీయాలను, ఇలా ఎమ్మెల్యేలు పార్టీలు మారే వ్యవహారాలను నిందించే అర్హత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే అని పరిశీలకులు అంటున్నారు. తనకు ఐదేళ్ల అధికారం ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ఎలా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. ఏకంగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు తన పార్టీలోకి చేర్చుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వారికి అలా చంద్రబాబు నాయుడు తన పార్టీ కండువాలు వేశారు.వారిలో ఏకంగా నలుగురికి మంత్రి పదవులు సైతం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అదంతా అప్రజాస్వామ్యకమైన తీరే. అందులో ఎలాంటి సందేహం లేదు.
ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చట్ట సభలో కొనసాగే అర్హత లేదు. వారి పై తక్షణం ఎమ్మెల్యేలుగా అనర్హత వేటు వేయాల్సింది. అయితే తెలుగుదేశం వాళ్లు అలా చేయలేదు. చంద్రబాబు నాయుడు అలా ఇరవైమూడు మంది ఎమ్మెల్యేలను అనైతికంగా - అప్రజాస్వామ్యికంగా తన పార్టీలోకి చేర్చుకున్నారు. వారిలో నలుగురును మంత్రులుగా కూడా చేసుకున్నారు. అదీ చంద్రబాబు నాయుడు మార్కు ప్రజాస్వామ్యం.
ఆ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబు నాయుడు లెక్క చేయనట్టుగా వ్యవహరించారు. అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోడీ ఏదో ఒక మాట అన్నారని స్పందించేయడం, తను చేయించిన ఫిరాయింపుల గురించి అంతా మరిచిపోయారన్నట్టుగా స్పందించడం విడ్డూరంగా ఉంది.ఈ విషయంలో బాబు తీరుపై విమర్శలు వస్తున్నాయి. బాబుకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హతే లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయినా చంద్రబాబు మాత్రం శుద్ధపూసలా నీతులు చెబుతున్నారు!