పర్సనల్స్ ఎక్కువ ప్రస్తావిస్తున్న బాబు

Update: 2016-02-13 07:08 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుంచి కొన్ని మాటలే తరచూ వింటుంటాం. మరికొన్ని మాటలు ఆయన నోటి నుంచి అస్సలు వినపడవు. ఎంతసేపటికి పని.. డెవలప్ మెంట్.. విజన్ లాంటి అంశాలు తప్పించి.. కుటుంబం గురించి.. తన వ్యక్తిగత ఇబ్బందుల గురించి పెద్దగా ప్రస్తావించటం కనిపించదు. పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న కారణమో.. వయసు మీద పడటమో కానీ.. కొన్ని విషయాల మీద తరచూ ఓపెన్ కావటం కనిపిస్తోంది.

ఫ్యామిలీ లైఫ్ గురించి.. వ్యక్తిగత ఇబ్బందుల గురించి అస్సలు ప్రస్తావించని చంద్రబాబు.. ఆ మధ్యన విభజన బాధితుడిని తానేనని.. తాను ఏపీలో ఉంటే.. తన  కుటుంబం హైదరాబాద్ లో ఉందని.. ఇది చాలా కష్టంగా ఉందని చెప్పి పలువురిని ఆశ్చర్యపర్చారు. ఈ తరహా మాటలు బాబు నోటి నుంచి రాకపోవటమే ఆశ్చర్యానికి అసలు కారణంగా చెప్పొచ్చు.

తాజాగా అలాంటి వ్యక్తిగత విషయాన్నే మరొకటి ప్రస్తావించారు చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఎన్జీవో సంఘ సమావేశంలో మాట్లాడిన ఆయన.. తన మనమడి ప్రస్తావన తీసుకొచ్చారు. తాను విజయవాడలో ఉండిపోవటంతో మనమడితో ఎక్కువగా గడపలేకపోతున్నానని.. అందుకు టైం సరిపోవటం లేదని వ్యాఖ్యానించారు. బాబు మాటల్ని చూస్తే.. హైదరాబాద్ కు దూరంగా.. విజయవాడలో ఫ్యామిలీకి దూరంగా ఉండటం కష్టంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకేనేమో తరచూ తాను కుటుంబానికి దూరంగా ఉంటున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారని చెప్పొచ్చు. వర్క్ హాలిక్ గా కనిపించే చంద్రబాబు లోపల ఇంతటి ఫ్యామిలీ పర్సన్ ఉన్నారా? అన్న భావన కలగటం ఖాయం.
Tags:    

Similar News