• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబు రివ్యూలోనూ ‘‘బీకాంలో...

బాబు రివ్యూలోనూ ‘‘బీకాంలో ఫిజిక్సే’’

By - Tupaki Desk
Update: 2017-03-12 05:01 GMT
ఒక్క వ్యాఖ్య.. ఒకే ఒక్క వ్యాఖ్య సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చిన్నా..పెద్దా అన్నతేడా లేకుండా అందరి చేత నవ్వులు పూయించటమే కాదు.. నేతల అవగాహనారాహిత్యానికి నిలువెత్తు రూపంగా ‘బీకాంలో ఫిజిక్స్’ చదివినట్లుగా చెప్పుకున్న ఏపీ అధికారపక్ష ఎమ్మెల్యే మాట తరచూ చర్చల్లో అంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాలు మొదలు.. రచ్చబండ వరకూ వాళ్లు..వీళ్లు అన్న తేడా లేకుండా విపరీతంగా వాడేస్తున్న..బీకాంలో ఫిజిక్స్ ముచ్చట ఎప్పటకప్పుడు  కొత్త చర్చకు తావిస్తోంది.

తాజాగా ఇదే ముచ్చట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి వెంట రావటం విశేషంగా చెప్పాలి. ఎటకారంగా మారటమే కాదు..పార్టీ ఇమేజ్ ను తీవ్రంగా డ్యామేజ్ చేసిన ఈ వ్యవహారాన్ని బాబు ప్రస్తావించటమే కాదు.. వివరణ అడిగిన వైనం తాజాగా చోటు చేసుకుంది.ఈమధ్యన అన్ని జిల్లాల్ని రివ్యూలు చేస్తున్న చంద్రబాబు..తాజాగా కృష్ణా జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేతలకు పలు సూచనలు చేయటంతో పాటు.. ఎవరి నియోజకవర్గాలు వారే చూసుకోవాలే తప్పించి.. ఒకరి అడ్డాలోకి మరొకరు వెళ్లొద్దన్న స్ట్రాంగ్  వార్నింగ్ ఇచ్చేశారు.

ఈ సందర్భంగా కొన్ని జిల్లాల్లో పార్టీనేతల మధ్య నెలకొన్న విబేధాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బాబు.. అలాంటి పనులు చేయొద్దని గట్టిగా చెప్పినట్లు సమాచారం. హాట్ హాట్ గా సాగుతున్న సమావేశంలో.. బీకాంలో ఫిజిక్స్ ముచ్చట రావటం మీటింగ్ ను కాస్తంత కూల్ చేసినట్లుగా తెలుస్తోంది. బీకాంలో ఫిజిక్స్ ముచ్చటపై  సోషల్ మీడియాలో సాగుతున్న రచ్చను ప్రస్తావిస్తూ.. అలా ఎలా చెప్పారంటూ జలీల్ ఖాన్ ను బాబు వివరణ కోరినట్లుగా తెలుస్తోంది. ఇంటర్వ్యూ సందర్భంగా తాను చెప్పిన మాటల్ని సంబంధం లేకుండా రాసేశారని..దీంతో తప్పుడు ప్రచారంతో ఇలా జరిగినట్లుగా జలీల్ ఖాన్ చెప్పినట్లుగా చెబుతున్నారు.

అయితే.. జలీల్ ఖాన్ ఇచ్చింది వీడియో ఇంటర్వ్యూ అన్న విషయం తెలిసిందే. ఈ వీడియోలో.. జలీల్ ఖాన్ అడ్డంగా బుక్ కావటం మర్చిపోకూడదు. అయితే.. బాబు అడిగిన ప్రశ్నకు ఎప్పటి మాదిరే కూల్ గా సమాధానం చెప్పేసిన జలీల్ ఖాన్.. బీకాంలో ఫిజిక్స్ ముచ్చటకు తనదైన శైలిలో వివరణ చెప్పేశారని చెబుతున్నారు. విషయల మీద పూర్తిస్థాయి అవగాహన లేని బాబు..జలీల్ ఖాన్ మాటలకు..మరోసారిఇలాంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Chandrababu Naidu 
  • Jaleel Khan 
  • Bcom Physics 

Similar News

రాజమండ్రికి 'మహా కుంభమేళా' వైభవం.. గోదావరి పుష్కరాల ప్రత్యేకతలు ఇవే..!

2026-11-25 13:13 GMT

అమెరికా కల ఎంత గొప్పదైనా.. చిన్నారుల ప్రాణాల కంటే గొప్పది కాదు...

2026-11-25 13:13 GMT

పాకిస్తానీ న‌టీన‌టుల‌ను వెంటాడుతున్న ఆప‌రేష‌న్ బొమ్మాళీ

2026-11-25 12:54 GMT

అమెరికా కల చెదిరిందా? భారతీయ టెక్కీల గుండెల్లో ఐబీఎం పెట్టిన 'డిసెంబర్ 31' పిడుగు

2026-11-25 12:51 GMT

ఇంటింటికీ వచ్చి క్షమాపణ చెబుతా: గౌతు శిరీష సంచలన వీడియో

2026-11-25 12:50 GMT

అక్కడి నుంచే పోటీ.. ఆ నియోజకవర్గమే ఎందుకు? కవిత నిర్ణయం వెనుక అసలు కథేంటి?

2026-11-25 12:42 GMT

ఒకే క్లిక్‌తో 10 లక్షల మందికి సందేశం.. టీడీపీని నడిపిస్తున్న డిజిటల్ వెన్నెముక

2026-11-25 12:05 GMT

జ‌న‌సేన 'క‌ట్టు' త‌ప్పుతోంది: సాగ‌దీతే కార‌ణమా.. ?

2026-11-25 12:04 GMT

టీడీపీలో సామాన్య కార్యకర్తలకు పదవులు.. అసలు సీక్రెట్ ఇదే.. పనిచేసిన లోకేశ్ మాస్టర్ ప్లాన్!

2026-11-25 11:01 GMT

10 లక్షల మందితో ‘మైటీడీపీ’ యాప్ సరికొత్త రికార్డు.. లోకేశ్ డిజిటల్ వ్యూహం సక్సెస్!

2026-11-25 10:31 GMT

పింకీ సార్ పింకీ అంతే.. దీని ముందు బాహుబలి బర్రెలన్నీ పక్కకు బలాదూర్

2026-11-25 10:11 GMT

అమెరికాలో పదేళ్లు ఉంటే గ్రీన్‌కార్డా? లక్షలాది వలసదారులకు ఊరటనిచ్చేలా డెమోక్రాట్ల కొత్త బిల్లు

2026-11-25 10:10 GMT

Copyright @2026

Powered by Blink CMS