జీహెచ్ ఎంసి ఎన్నికల్లో చంద్రబాబు ఆశేమిటో ?
తెలంగాణాలో ఆంధ్రాపార్టీలుగా ముద్రపడిన కొన్ని పార్టీలు మూటా ముల్లే సర్దేసుకుని చాలా కాలామే అయ్యింది. ఆంధ్రాపార్టీలైన తెలుగుదేశంపార్టీ, వైసీపీ, జనసేన పార్టీల ఉనికి తెలంగాణాలో దాదాపు లేదనే చెప్పాలి. టీడీపీ కన్నా 2014 ఎన్నికల్లో వైసీపీనే నయమనిపించింది. ఎలాగంటే ఖమ్మం ఎంపి సీటుతో పాటు ఇదే జిల్లాలో మరో మూడు అసెంబ్లీ నియోజకర్గాలను కూడా గెలుచుకున్నది. సరే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో వాళ్ళంతా టీఆర్ఎస్ కండువా కప్పుసుకున్నారు లేండి. అప్పటి ఎన్నికల్లో కానీ ఆ తర్వాత 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కానీ టీడీపీని బాగా దెబ్బ కొట్టేసిన అంశం ఏమిటంటే చంద్రబాబు ప్రచారం చేయటమే.
కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. అయితే చంద్రబాబు ప్రచారం చేయటాన్ని కేసీయార్ బాగా జనాల్లో వ్యతిరేకత పెంచేసి మళ్ళీ తెలంగాణా వ్యవహారాల్లో ఆంధ్రాపార్టీలు జోక్యం చేసుకుంటున్నాయంటు ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టారు. దాంతో ముందస్తు ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఘోరంగా దెబ్బ తినేసింది. చంద్రబాబును చూస్తేనే జనాల్లో ప్రాంతీయ వాదం గుర్తకొస్తుందో లేకపోతే కేసీయారే జనాలను రెచ్చగొడుతున్నారో తెలీటం లేదు. ఏదేమైనా రిజల్టేమిటంటే టీడీపీకి నెగిటివ్ మార్కులే పడుతున్నాయి.
మరి ఇలాంటి పరిస్ధితుల్లో టీడీపీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో అన్నీ డివిజన్లలోను పోటీ చేయాలని చంద్రబాబు తాజాగా నేతలను ఆదేశించారు. గ్రేటర్ పరిధిలోని సీనియర్ నేతలతో మాట్లాడిన చంద్రబాబు 2050 విజన్ ప్రకారం టీడీపీ ఎన్నికల్లో గెలవాలని చెప్పారు. 2050 విజన్ బాగానే ఉంది, ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవటమూ ఒకేనే. కానీ పోటీ చేయటానికి గట్టి అభ్యర్ధులు దొరకవద్దా ? ఎన్నికల్లో గట్టిగా పోటీ చేస్తే పార్టీ అవసరమైన విధంగా ఆదుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇక్కడ అవసరం అంటే ఏమిటి ? పోటీలోకి దిగిన వాళ్ళకు కావాల్సినంత నిధులు సర్దుబాటు చేయటమేనా చంద్రబాబు ఉద్దేశ్యంలో. డబ్బులు ఖర్చుచేయటంలో టీడీపీ సామర్ధ్యం ఏమిటో అందరికీ తెలిసిందే. కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని పోటీ చేసేంతస్ధాయి గట్టి అభ్యర్ధులున్నారా ? ఆ అభ్యర్ధులను జనాల్లోకి బాగా తీసుకెళ్ళగలిగిన కార్యకర్తలున్నారా ? అనేదే డౌటు. నేతలతో జరిగిన జూమ్ సమావేశంలో గట్టిగా పోటీ చేయాలని, కష్టపడాలని, 2050 విజన్ ప్రకారం పనిచేయాలని చెప్పారే కానీ తాను ఎన్నికల్లో అభ్యర్ధుల తరపున ప్రచారం చేస్తనని మాత్రం చెప్పలేదు.
అంటే చంద్రబాబుకు కూడా డౌటున్నట్లే ఉంది. తాను గనుక ప్రచారంలోకి దిగితే మళ్ళీ టీఆర్ఎస్ ప్రత్యేక వాదాన్ని లేవనెత్తి జనాలను ఆకర్షించుకుంటుందేమో చూడాలి. ఇప్పటికి జరిగిన మూడు ఎన్నికల్లో అంటే రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికలు, ఒకసారి జీహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ చేసిందిదే. అయినా అప్పట్లో కేసీయార్ చెబితే జనాలు రెచ్చిపోయిన వాతావరణం ఇప్పుడు కూడా అలాగే ఉందా ? అనేది కూడా డౌటనుమానమే. టీఆర్ఎస్-బీజేపీ అభ్యర్ధులు గెలుపుకోసం ప్రయత్నిస్తే మధ్యలో ఎక్కడైనా టీడీపీ లాభపడే అవకాశం కూడా లేకపోలేదు. చూద్దాం ఏం జరుగుతుందో.