మోదీ గ్రాఫ్ ఢమాల్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రాఫ్ సగానికి సగం పడిపోయింది. ఇది కూడా కొన్ని సంవత్సరాలుగా తగ్గిన... పడిపోయిన ఆదరణ కాదు. కేవలం ఒక్కటంటే ఒక్క సంవత్సరంలోనే ప్రధానమంత్రి గ్రాఫ్ పడిపోయిందని సర్వేలు చెబుతున్నాయి. గత సంవత్సరం అంటే 2017 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశంలో 99 శాతం మంది ప్రజలను అనుకూలంగా ఓటు చేస్తే ఏడాది తిరిగే సరికి అది కాస్తా సగానికి సగం అంటే 50 శాతానికి పడిపోయింది. ఈ సర్వే ఏదో డబ్బులిచ్చి ప్రతిపక్షాలు చేయించిందో - భారతీయ జనతా పార్టీ అంటే నచ్చని పత్రికలు - ఎలక్ట్రానిక్ మీడియా కాని చేసింది కాదు. ఈ సర్వే చేపింది ఆర్థిక విశ్లేషకులు రుచిర్ శర్మ. ఈయన గతంలో చేసిన సర్వేలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. గ్రామాల్లోకి - పట్టణాల్లోకి - నగరాల్లోకి వెళ్లి పూర్తి స్ధాయిలో హేతుబద్దంగా సర్వేలు చేస్తారు రుచిర్ శర్మ. జాతీయ స్ధాయి రాజకీయ పార్టీలు రుచిర్ శర్మ చేసే సర్వేలపై ఆధారపడి అభ్యర్ధుల ఎంపిక - మ్యానిఫెస్టోల రూపకల్పన వంటివి చేపడతారు. ఆయన చేసే సర్వేలపై అన్ని పార్టీలకు ఆమోద ముద్ర ఉంటుంది. అలాంటి రుచిర్ శర్మ ప్రధానమంత్రి గ్రాఫ్ సగానికి సగం పడిపోయిందని ప్రకటించడం భారతీయ జనతా పార్టీలో ప్రకంపనలు స్రష్టిస్తోంది. ఇంతకు ముందు 2004 సంవత్సరంలో కూడా రుచిర్ శర్మ సర్వే ఫలితాలు నిజమయ్యాయి.
ప్రధానమంత్రి గ్రాఫ్ పడిపోవడం వెనుక ఉన్న పెద్ద కారణం జాతీయ స్ధాయిలో విపక్షాలన్నీ ఏకం కావాలనుకోవడమే అని తేలింది. 2014 సంవత్సరంలో ఇదే ఫార్ములాతో భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించేందుకు ముందుకు వెళ్లింది. ఇప్పుడు విపక్షాలు ఆ పని చేస్తూండడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రాఫ్ పడిపోయిందని రుచిర్ శర్మ ఓ అవగాహనకు వచ్చారు. ఇక రుచిర్ శర్మ తన సర్వేలో ఉత్తరప్రదేశ్ గురించి ప్రస్తావించారు. అక్కడ 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో బహుజన సమాజ్ వాదీ పార్టీ - సమాజ్ వాదీ పార్టీలు కలిసి పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ చిక్కుల్లో పడుతుందని - ఇక్కడ ఆ రెండు పార్టీలు లోక్ సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికలు కుల ప్రాతిపదికన జరుగుతాయని - అగ్ర కులాల వారు బిజేపీకి ఓటు వేస్తే దళితులు మాయావతి పార్టీకి ఓటు వేస్తారని ఆయన ఆ సర్వేలో పేర్కొనడం విశేషం. మొత్తానికి దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రాఫ్ పెద్ద ఎత్తున పడిపోవడం కాంగ్రెస్ సహా మిగిలిన విపక్షాలకు కలిపి వచ్చే అవకాశం.