లోకేశ్ ను అడ్డంగా బుక్ చేసే ఛాన్సు మిస్ చేసిన జగన్ మంత్రులు

Update: 2020-06-18 10:10 GMT
అవకాశాలు అన్నిసార్లు రావు. బంగారం లాంటి ఛాన్సు వచ్చినంతనే.. ఏపీ అధికారపక్ష నేతలు దాన్నే మాత్రం మిస్ చేసుకోకుండా ఉండాల్సింది. ఆగ్రహం.. అంతకుమించిన ఆగ్రహంతో బ్యాలెన్సు మిస్ అయ్యారు జగన్ మంత్రులు. బుధవారం ఏపీ మండలి సమావేశాల్నిచూసినప్పుడు.. అక్కడి రచ్చను టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్ ఫోటోలు తీశారన్న సందేహం వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని జగన్ పార్టీ నేతల మాదిరే డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహణ్యం సైతం సందేహానికి గురయ్యారు

తనకొచ్చిన అనుమానాన్ని మైక్ లో చెప్పి.. సభలో ఫోటోలు తీయకూడదన్న మాటను చెప్పారు. ఇలాంటివేళలో.. లోకేశ్ చేతిలో ఫోన్ ఉన్నవేళ.. అదే విషయాన్ని హైలెట్ చేయాల్సిన ఏపీ మంత్రులు ఆగ్రహంతో ఊగిపోవటమే కాదు.. ఆలోచనతో ఆయన్ను ఇరుకున పెట్టే ఛాన్సును మిస్ చేసుకున్నారనే చెప్పాలి. అప్పటివరకూ ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నప్పుడు.. ఆ గొడవను పక్కన పెట్టేసి.. ఫోకస్ అంతా లోకేశ్ ఫోన్ వ్యవహారం మీద మళ్లిస్తే.. విపక్షం కచ్ఛితంగా ఇరుకున పడేది.

ఒకవేళ.. లోకేశ్ ఫోటోలు తీసుకుంటున్నారా? లేదా? అన్నది తేల్చాలని ప్రశ్నించినా పరిస్థితి మరోలా ఉండేది. సభకు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. వీటిని చూసినప్పుడు లోకేశ్ ఫోటోలు తీసినట్లే కనిపిస్తుంది. అయితే.. తాను ఫోటోలు తీయలేదని లోకేశ్ చెబుతున్న వేళ.. ఆయన ఫోటోలు తీశారన్న విషయాన్ని ఆధారాలతో సభ ముందు పెడితే.. అడ్డంగా బుక్ కావటమే కాదు.. విపక్షానికి ఉన్న ప్రధాన బలం భారీగా తగ్గిపోయేది. బుద్ధి బలంతో ప్రత్యర్థిని దెబ్బ తీయాలన్న విషయాన్ని జగన్ మంత్రులు మిస్ కావటం ఒక ఎత్తు అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్ ను చూసినప్పుడు లోకేశ్ చేత సెల్ఫ్ గోల్ కొట్టించే అద్భుతమైన అవకాశాన్ని పనికిమాలిన ఆవేశంతో చేజార్చుకున్నారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News