ఏపీకి కేంద్రం ఇచ్చిందెంతో తెలుసా?

Update: 2019-12-12 10:31 GMT
పార్లమెంట్ సాక్షిగా కేంద్రం...  ఏపీకి ఎంత మొత్తం నిధులు ఇచ్చిందో లెక్క చెప్పింది. బుధవారం రాజ్యసభలో కాంగ్రెస్, వైసీపీ సభ్యులు లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి లిఖితపూర్వకంగానే సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని నిధులు ఇచ్చామో విడమర్చి లెక్క చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలు - రెవెన్యూ లోటు భర్తీ - మిగిలిన నిధులతో కేంద్రం అధికారికంగా  ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటివరకూ రూ.33,923.01 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రహోంశాఖ సహాయమంత్రి రాజ్యసభలో తెలిపారు. ఇక ఏపీలోని 7 వెనుకబడిన జిల్లాలకు రూ.2100 కోట్ల ఆర్థిక సాయం అందించాలని నీతి అయోగ్ సిఫార్సు చేసిందన్నారు.

ఇక ఏపీ కలల ప్రాజెక్టు పోలవారానికి ఏపీ ప్రభుత్వం రూ.5103 కోట్లు రుణం తీసుకొని ఖర్చు చేసిందని.. దానిని వెంటనే కేంద్రం ఇవ్వాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. అలాగే 55548 కోట్లతో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను ఆమోదించాలని కోరారు. జీఎస్టీ బకాయిలు 1605 కోట్లు రావాలని..ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏపీలోని వెనుకబడిన ఉత్తరాంధ్ర - రాయలసీమలోని ఏడు జిల్లాలకు వెంటనే కేంద్రం హామీనిచ్చిన విధంగా మిగిలిన 1050 కోట్లు విడుదల చేయాలని వైసీపీ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. రెవెన్యూ లోటు కింద 18969 కోట్లను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని విన్నవించారు.
Tags:    

Similar News