కేంద్ర పథకాలతో నవ్యాంధ్ర అభివృద్ధి

Update: 2015-08-17 13:08 GMT
కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన పథకాలు నవ్యాంధ్ర రాజధానికి కలిసి వస్తున్నాయి. హృదయ్, ప్రసాద్ పథకాలు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతానికి కళాత్మక శోభను ఇవ్వనున్నాయి. ఇందులో భాగంగా రాజధాని ప్రాంతంలో చారిత్రక, పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశంలో అద్భుతంగా రూపుదిద్దుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే దాదాపు రూ.140 కోట్లతో ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన నిర్మాణాలు ఆధునిక రూపును సంతరించుకోనున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హృదయ్, ప్రసాద్ పథకాల కింద రాజధాని ప్రాంతంలోని అమరావతి, వైకుంఠపురం, మల్కాపురం శివాలయం, ఉండవల్లి గుహాలయాలు, మంగళగిరి, కొండవీడు కోట, కోటప్పకొండ దేవస్థానాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని సంకల్పించారు. దేవాదాయ, పర్యాటక, పురావస్తు శాఖల నుంచి ఇప్పటికే కేంద్ర శాఖలు ప్రతిపాదనలను కూడా తెప్పించుకున్నాయి. ప్రసాద్ పథకం కింద తొలి దశలో కేంద్ర ప్రభుత్వం రూ.454 కోట్లను విడుదల చేయగా.. అందులో నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రూ.93 కోట్లు రానున్నాయి. హృదయ్ పథకానికి అమరావతికి రూ.55 కోట్లు రానున్నాయి. అంటే మొత్తంమీద రూ.140 కోట్ల వరకు అమరావతిలోని వివిధ ప్రదేశాల అభివృద్ధికి రానున్నాయి.

అమరావతి పట్టణం నవీకరణకు ఈ నిధుల్లో దాదాపు రూ.50 కోట్లు వినియోగించనున్నారు. అమరేశ్వరస్వామి ఆలయ అభివృద్ధకి రూ.9 కోట్లు, ధ్యానబుద్ధ ప్రాజెక్టుకు రూ.18 కోట్లు; మంగళగిరి అభివృద్ధికి రూ.1.63 కోట్లు, కాలచక్ర మ్యూజియానికి రెండు కోట్లు; మల్కాపురం అభివృద్ధికి కోటి; ఉండవల్లి గుహాలయాలకు రూ.1.5 కోట్లు; మహా చైత్యం అభివృద్ధికి మూడు కోట్లకుపైగా నిధులను వెచ్చించనున్నారు.
Tags:    

Similar News