72 కోట్ల మోసం.. మాజీ ఎమ్మెల్యేపై సీబీఐ కేసు

Update: 2021-04-22 08:33 GMT
పొగాకు వ్యాపారం చేస్తున్నానని ఓ మాజీ ఎమ్మెల్యే ఎస్.బీ.ఐకి కోట్ల రూపాయలను ఎగనామం పెట్టాడు. అప్పు చెల్లించాలని బ్యాంకు అధికారులు తిరిగినా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు బ్యాంకు వారు సీబీఐని ఆశ్రయించారు. దీంతో మాజీ ఎమ్మెల్యేతోపాటు 8మందిపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకటరావు గుంటూరు ఎస్.బీ.ఐ స్పెషలైజ్డ్ కమర్షియల్ బ్రాంచిలో పొగాకు వ్యాపారం కోసం ఎథ్నిక్ అగ్రోస్ లిమిటెడ్ పేరిట రూ.72.17 కోట్ల రుణం తీసుకున్నాడు. దానికి గ్యారెంటీగా చరాస్థులు, స్థిరాస్థులను బ్యాంకు చూపించారు.

అయితే బ్యాంకు అధికారుల విచారణలో ఆస్తులకు రుణగ్రహీత చూపించిన ధర లేదని.. వాటిల్లో కొన్ని ఆస్తులు అప్పటికే తాకట్టు పెట్టినట్టు గుర్తించారు. దీనిపై వెంకటరావును ప్రశ్నించినా.. లీగల్ నోటీసులు పంపినా స్పందించలేదు. దీంతో ఎస్బీఐని మోసగించారని అధికారులు సీబీఐని ఆశ్రయించారు.

దీంతో మాజీ ఎమ్మెల్యే వెంకటరావు, ఆయన సోదరుడు తాడిశెట్టి మురళీ మోహన్, వారు ప్రమోటర్లుగా ఉన్న ఎథ్నిక్ అగ్రోస్ లిమిటెడ్ సంసథపై సీబీఐ కేసు నమోదు చేసింది.  వారితోపాటు కొందరు బ్యాంకు ఉద్యోగులను నిందితులుగా పేర్కొంది.
Tags:    

Similar News