చంద్రబాబు మార్ఫింగ్ ఫొటో.. బుక్కైన వర్మ
రాంగోపాల్ వర్మ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. కొన్ని రోజులక్రితం ట్విట్టర్ లో చంద్రబాబు మార్ఫింగ్ ఫొటోను పెట్టి జగన్ చేత కండువా కప్పించుకొని వైసీపీలో బాబు చేరిపోయాడని సెటైర్ వేస్తూ వర్మ పోస్టు చేశారు. ఈ ఫొటో దుమారం రేపింది. మరో ఫొటోలో నారాలోకేష్, బ్రాహ్మణి, బాలక్రిష్ణ ప్రతిష్టని దిగజార్చేలా కామెంట్స్ ఉన్నాయి. వర్మ ఈ మార్ఫింగ్ ఫొటోలతో చేసిన ట్వీట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే..
ఆర్జీవీ ట్వీట్స్ పై సీరియస్ గా స్పందించిన టీడీపీ నేతలు కేసులు పెట్టారు. దేవి బాబు చౌదరి అనే టీడీపీ కార్యకర్త పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో కేసు కూడా పెట్టారు. తెలంగాణలోనూ కేసులు పెట్టారు. వర్మ క్షమాపణ చెప్పే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆర్జీవీ చంద్రబాబు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాడని టీడీపీ ఆగ్రహంగా ఉన్నారు.
ఇక టీడీపీ నేతలు వేసిన కేసుల గురించి పోలీసులు కూడా స్పందించారు. ఆర్జీవీ చంద్రబాబు కుటుంబంపై చేసిన కామెంట్స్ అనవసరమైనవిగా పోలీసులు అభివర్ణించారు. మార్ఫింగ్ ఫొటోలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తాజాగా పశ్చిమ గోదావరి పోలీసులు తెలిపారు. దీంతో వర్మపై పోలీసులు ఏం చర్య తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం వర్మ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆంధ్రాలో విడుదల కాలేదు. ఆ సినిమాపై కోర్టు స్టే వేసింది. ఆ చిక్కులకు బాబే కారణమని వర్మ రెచ్చిపోతున్నారు. దానికి ప్రతీకారంగానే ట్వీట్స్ చేస్తూ బాబును ఎండగడుతున్నారు. దీనిపై కేసులతో వర్మకు టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.