రైతు ఆత్మహత్య ...ఎమ్మార్వో, వీఆర్వోపై కేసు నమోదు !
ప్రతి సంవత్సరం ఎంతోమంది రైతులు ఆత్మహత్య లకు పాల్పడుతూ ఉంటారు. కొంత మంది పంటను నష్టపోవడంతో, మరికొంత మంది రైతులు తహసీల్దార్ కార్యాలయంలో పనులు జరగకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనే పెద్దపల్లి జిల్లాలోనూ చోటుచేసుకుంది. అధికారులు తన సమస్యను పరిష్కరించడం లేదంటూ ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్యకి పాల్పడ్డాడు.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకి వెళ్తే ... కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లికి చెందిన రాజిరెడ్డి, పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఎకరం 20 గుంటల భూమి అధికారులు తన పేరిట ఆన్ లైన్ చేయడం లేదంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.. రైతు రాజిరెడ్డి సూసైడ్ నోట్ లో ఎమ్మార్వో వేణుగోపాల్, వీఆర్వోలు గురు మూర్తి, స్వామి ముగ్గురు వ్యక్తులే కారణం అని పేర్కొన్నారు. దీన్ని బట్టిపరిశీలిస్తే భూమి ఆన్ లైన్ విషయంలో మనస్తాపం చెంది రైతు రాజిరెడ్డి ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతు ఆత్మహత్య ఘటనలో పలువురిపై కేసు నమోదు చేశారు పోలీసులు, సూసైడ్ నోట్ ఆధారాలతో పాటు రాజిరెడ్డి కుమారుడు వేణుగోపాల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మార్వో, వీఆర్వోలు, బందువులపై కేసు నమోదు చేశారు.