నోటితో చెప్పలేం.. పిల్లలు పుడతారని బాలిక గుండెను తిన్నాడు
సంచలనం కోసం ఈ వార్తను రాయటం లేదు. నిజానికి.. ఈ వార్త రాయటానికి ముందు ఒకటికి పదిమార్లు రాయకూడదనే అనుకున్నాం. కానీ.. కొన్ని వికృతాలు ప్రజలకు తెలియజేయటం ద్వారా.. ఇలాంటి రాక్షసులు మన చుట్టూ ఉన్నారన్న విషయం తెలుస్తుందన్న ఉద్దేశంతోనే రాశాం. నిజానికి ఈ వార్త రాసే సమయంలో ఒళ్లు గగుర్పాటుకు గురైంది. మనసంతా చేదుగా మారిపోయింది. మనిషిగా పుట్టినందుకు అసహ్యం అనిపించింది. ఇంతటి దారుణ ఘటన కాన్పూరులో చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా.. మూఢంతో వ్యవహరించిన వీరిని ఏం చేసినా తక్కువే అవుతుంది. అసలేం జరిగిందంటే?
ఆ మూఢ నమ్మకంతో నిందితుడు.. అతడి భార్య.. మామ.. అత్త కూడా తినటం గమనార్హం. పిల్లలు పుట్టటం లేదని నిందితుడు పరశురామ్.. అతని భార్య సునయన చిన్నారి శరీర భాగాల్ని తినాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తన మేనల్లుడు అంకుల్ అతని స్నేహితుడు బీరన్ కు రూ.1500 ఇచ్చానని చెప్పాడు. దీపావళి వేళ.. ఏడేళ్ల చిన్నారికి మతాబులు కొనిపెడతామన్న ఆశ చూపించి.. ఆ పాపనుదారుణంగా అత్యాచారం చేశారు.
అనంతరం.. శరీర భాగాల్ని బయటకు తీసి.. తిన్నారు. మిగిలిన అవయువాల్ని కుక్కలకు వేశారు. బాలిక కనిపించకపోవటంతో బాధిత కుటుంబ సభ్యులు రాత్రంతా తమ కుమార్తె కోసం వెతకసాగారు. చివరకు కాళీ మందిరం సమీపంలో చెల్లాచెదురుగా పడి ఉన్న బాలిక అవయువాల్ని గుర్తించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అక్కడి పరిస్థితిని చూసి హడలిపోయారు. ఈ ఉదంతం కాసేపటికే యూపీలో సంచలనంగా మారింది. ఈ ఉదంతం గురించి విన్న వారంతా హడలిపోవటమే కాదు.. ఈ వికృతకాండను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పాడు పని చేసిన వారికి ఇంకా విచారణ.. శిక్ష లాంటివి అవసరమా? అన్నది ప్రశ్న.