గర్ల్ ఫ్రెండ్ తో గొడవ పడి 22 మంది ప్రాణాలు తీసిన యువకుడు !
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మరి విజృంభిస్తున్న తరుణంలో కెనడాలో అత్యంత విషాద ఘటన చోటు చేసుకుంది. కెనడాలోని నోవాస్కోటియాలో గాబ్రియేల్ వర్ట్ మన్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో దాదాపు 22 మంది ప్రాణాలు కొల్పోయిన సంగతి తెలిసిందే. అయితే దుండగుడు ఈ కాల్పులకు పాల్పడటం వెనక.. అతని ఇంట్లో చోటుచేసుకున్న ఘర్షణే కారణమని తెలిసింది. గాబ్రియేల్ కు, అతని గర్ల్ ఫ్రెండ్ కు మధ్య చెలరేగిన వివాదం నోవాస్కోటియాలో విషాదం నింపింది.
పూర్తి వివరాలలోకి వెళితే కెనడాలోని హాలిఫాక్స్ సమీపంలోని డార్ట్ మౌత్ లో గాబ్రియేల్ కృత్రిమ దంతాలు అమర్చే పని చేస్తూ జీవనం సాగించేవాడు. అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఇటీవల గాబ్రియేల్ కు అతని గర్ల్ ఫ్రెండ్ కు మధ్య గొడవ జరిగింది. గొడవ అనంతరం కోపోద్రిక్తుడైన గాబ్రియేల్ నోవాస్కోటియా ప్రాంతంలో కాల్పులు జరిపాడు. గాబ్రియేల్ జరిపిన కాల్పుల్లో దాదాపు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన లో ఒక మహిళా పోలీసు కూడా మృతి చెందటం గమనార్హం.
ఈ విషయాన్ని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ అధికారి ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. అయితే ఈ కాల్పుల నుంచి గాబ్రియేల్ క్షేమంగా బయటపడ్డారు. పోలీసు యూనిఫాం ధరించి, పెట్రోలింగ్ వాహనం మాదిరి ఎస్ యూవీలో తనుండే వీధిలోని ఓ ఇంట్లోకి ప్రవేశించి అందులోని వారిని కాల్చి చంపాడు. అనంతరం అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలోని మరోప్రాంతంలో కాల్పులకు తెగబడ్డాడు. కొన్ని ఇళ్లకు నిప్పు కూడా పెట్టాడు. దీనిని కెనడా చరిత్రలోనే ఇది అత్యంత విషాద ఘటన అని అధికారులు తెలిపారు