కాలిఫోర్నియా కాల్పులు: ఆరుగురు మృతి.. 10 మందికి గాయం

Update: 2022-04-04 04:01 GMT
అమెరికాలో తుపాకీ ముప్పు మళ్లీ మొదలైంది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఉన్న డౌన్‌టౌన్ శాక్రమెంటోలో జరిగిన సామూహిక కాల్పుల ఘటనలో దాదాపు  ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గాయపడ్డారు. శాక్రమెంటో పోలీసులు ఈ ఘోర కాల్పుల ఘటనకు సంబంధించి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంఘటన జరిగిన కొద్దిసేపటికే.. ట్విట్టర్‌లో వైరల్ వీడియో ప్రసారమైంది. దీనిలో ప్రజలు కాల్పుల శబ్దాలు.. గందరగోళం మధ్య వీధి గుండా పరిగెత్తడం కనిపించింది.

కాల్పుల జరిగిన ప్రదేశంలో అంబులెన్స్‌లు వచ్చి గాయపడ్డ వారిని తరలించాయి. లండన్ నైట్‌క్లబ్‌తో సహా అనేక బార్‌లు.. రెస్టారెంట్‌లు ఉండే ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

శాక్రమెంటో పోలీసులు ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు కాల్పుల శబ్దాలు విని అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కాల్పుల మోత మోగింది. వీధిలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి ఉన్నారు.  సంఘటనా స్థలానికి వచ్చేసరికి ఆరుగురు చనిపోయారు.
Read more!

ఈ సంఘటనలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది అనుమానితులు ప్రమేయం ఉందా?  లేదా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. సాక్షులు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని ప్రజలను అభ్యర్థించారు.

ఆదివారం నాటి సంఘటనలో తుపాకీ హింస మరోసారి అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికన్ సమాజంలో మారణాయుధాల ప్రాబల్యం గురించి చర్చను తీవ్రతరం చేసింది. ఇప్పటికే ఇలా తుపాకులతో విచ్చలవిడిగా కాల్పుల్లో అమెరికాలో సంవత్సరానికి సుమారు 40,000 మరణాలు చోటుచేసుకుంటున్నాయి.
Tags:    

Similar News