మేమింతే..! బర్త్​డే వేడుకల్లో గాల్లోకి కాల్పులు.. తల్వార్​తో కేట్​ కటింగ్​!

Update: 2020-11-20 09:30 GMT
ఇటీవల కొందరు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలన్నా కోరికతో చట్టాలను కూడా మరిచిపోతున్నారు. చుట్టుపక్కల వాళ్లను భయబ్రాంతులకు గురిచేస్తూ తామేంటో చూపించుకొనేందుకు తహతహలాడుతున్నారు. రివాల్వర్లు, కత్తులు ప్రదర్శిస్తూ ప్రజలను భయపెట్టేందుకు యత్నిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి తన పుట్టినరోజును విభిన్నంగా జరుపుకోవాలని భావించి చిక్కుల్లో పడ్డాడు.  

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఓ వ్యక్తి  అక్టోబరు 31న పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అతడి అతి ప్రవర్తన చిక్కుల్లో పడేసింది. పుట్టినరోజు వేడుకల్లో గన్​తో కాల్పులు జరపడం.. మారణాయుధాలు ప్రదర్శిస్తూ వేడుకలు జరుపుకున్నాడు. ఫోటోలు,  వీడియోలు కూడా తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కొందరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అవి  వైరల్​గా మారాయి.  ఆ ఫొటోల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్​ చేసేందుకు యత్నిస్తున్నారు. వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

పుట్టిన రోజు జరుపుకుంటున్న వ్యక్తి గాల్లోకి కాల్పులు జరపడం, పొడవైన ఖడ్గంతో కేకును కట్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. అనుమతి లేకుండా మరణాయుధాలు కలిగిఉండటం, ప్రదర్శించడం తీవ్రమైన నేరమని పోలీసులు తెలిపారు. ఇతరులను ఇబ్బందులకు గురిచేసేలా ప్రవర్తించడం సరికాదని వారు పోలీసులు హెచ్చరించారు. ఇప్పుడు ఆ  బర్త్ డే వేడుకలు జరుపుకున్న వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Tags:    

Similar News