ఇది తెలుసా..బుల్లెట్ కూ ఓ గుడి..నిత్య పూజలు!
మన దేశం విభిన్న సంప్రదాయాలకు, ఆచారాలకు ఎంతో ప్రసిద్ధి. మన సంస్కృతే ఎంతో ప్రత్యేకం. దేశంలో విభిన్న కులాలవారు, విభిన్న మతాల వారు నివసిస్తున్నారు. ఒకరి మతాలను మరొకరు గౌరవించుకోవడం వల్లే అందరం కలసి ఉండటం సాధ్యమవుతోంది. దేశంలో ప్రజలకు నమ్మకాలు ఎక్కువ. పాముకు కూడా పుట్టలో పాలు పోస్తాం. చివరికి విష పురుగైన తేళ్లకు కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. ఏ బండారాయో దైవాకారంలో కనిపించినా ముక్కుతాం. కూరగాయల్లో, దుంపలో లింగా కారంలో ఉందని.. వినాయకుడి లాగా కనిపిస్తోందని పూజిస్తుంటాం. కొందరు అవి మూఢ నమ్మకాలు అంటున్నా అనాదిగా ఆ నమ్మకాలు సమాజంలో ఓ భాగం అయిపోయాయి.
బుల్లెట్ కి దైవంలా నిత్య పూజలు
ఇవన్నీ ఒక ఎత్తయితే రాజస్థాన్ లోని పాలీ దగ్గర 350 సీసీ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ని అక్కడి ప్రజలు దైవంగా కొలుస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. కొన్నేళ్ల కిందట ఓమ్ బన్నా అనే వ్యక్తి జాతీయ రహదారిపై బుల్లెట్ బైక్ పై ప్రయాణిస్తూ వచ్చేటటువంటి కొన్ని మృతిచెందాడు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ బుల్లెట్ బైక్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే ఆ బుల్లెట్ బైక్ తెల్లారేసరికి ప్రమాదం చోటే కనిపించింది. పోలీసులు ఆ బైక్ ను ఎన్నిసార్లు స్టేషన్ తీసుకెళ్ళినా అది తిరిగి ఓమ్ బన్నా చనిపోయిన ప్రదేశానికే చేరుకునేది. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి ప్రచారంలోకి రావడంతో తమకు ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆ బైక్ ని జనాలు పూజించడం మొదలు పెట్టారు. ఓ చిన్న పాటి స్టేజ్ కట్టి దానిపై బైక్ ని ఉంచి నిత్య పూజలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతం ఒక దైవ ప్రదేశంలా మారింది.
ఎండకు వానకు బండి దెబ్బ తినకుండా ఓ అద్దాల బాక్స్ వాడుతుంటారు. ఆ ప్రదేశానికి ఓమ్ బన్నా అనే పేరు వచ్చింది. ప్రమాదాల బారిన పడకుండా చూడాలంటూ ఆ బండికి, ఆ పక్కనే ఉన్న ఓ చెట్టుకి దారాలు కడుతుంటారు. ఎప్పుడూ ఆ బైక్ హ్యాండిల్ నిండా పూల దండలతో కనిపిస్తుంటుంది. ఓమ్ బన్నా ప్రాంతం ఓ పుణ్య క్షేత్రంలా అక్కడ దుకాణాలు వెలిసాయి. పూల దండలు, తాయెత్తులు, ముడుపుల దారాలు విక్రయిస్తుంటారు. ఓమ్ బన్నా చిత్ర పటాన్ని బండి పక్కనే పెట్టి నిత్య పూజలు చేస్తుంటారు. ప్రమాదానికి గురైన ఓ బండి ఒక పుణ్య క్షేత్రంలా మారడం నిజంగా వింతేనని దీని గురించి విన్నవారంతా చెబుతుంటారు.