బ్రెజిల్​ మళ్లీ కరోనా విజృంభణ.. పెరుగుతున్న కేసులు, మరణాలు..!

Update: 2021-02-07 07:00 GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టింది. కేసులు కూడా తక్కువయ్యాయి. వ్యాక్సిన్​ వచ్చేసింది. ఇవీ నిన్నటి వరకు వినిపించిన వార్తలు. అయితే తాజాగా బ్రెజిల్​లో కరోనా కేసులు, మరణాలు పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తున్నది.

ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా కేసులు తగ్గుతుండటంతో.. అమెరికా, బ్రెజిల్​, బ్రిటన్​ వంటి దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. కొత్త స్ట్రెయిన్​ కూడా ఆందోళనకు గురిచేస్తున్నది.

చైనాలో మొదలైన ఈ మహమ్మారి యూరప్​ దేశాలను గడగడ లాడించింది.

ఆ తర్వాత కొంత కాలానికి కరోనా తగ్గుముఖం పట్టింది. అయితే ఇటీవల మాత్రం కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. అమెరికాలో ప్రస్తుతం రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజు మూడువేల మంది కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు.


గత రెండు మూడు నెలలుగా బ్రెజిల్​లో కేసుల సంఖ్య పెరుగుతున్నది.

దీంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బ్రెజిల్​లో ప్రతిరోజు సుమారుగా 57 వేల కేసులు నమోదవుతున్నాయి. కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Tags:    

Similar News