రేప్ ను అడ్డుకున్న రజనీ అభిమాని

Update: 2016-07-24 06:22 GMT
కబాలి సినిమా ఒక మహిళను రక్షించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాని.. తన అభిమాననటుడ్ని స్ఫూర్తిగా తీసుకొని. .ఆయన సినిమాలోని సీన్లను అనుకరిస్తూ ఒక మహిళను కాపాడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా విడుదలైన కబాలి సినిమా స్ఫూర్తితోనే తానీ పని చేసినట్లుగా చెబుతున్నాడు సదరు అభిమాని.

కబాలి చిత్రం విడుదలైన నేపథ్యంలో మొదటి రోజు మొదటి ఆటను చూసి ఇంటికి బయలుదేరాడు వసంత్ పాల్అనే అభిమాని. ఎయిర్ పోర్ట్ రూట్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో వేరే రూట్లో ఇంటికి వెళుతున్నాడు. ఈ సమయంలో ఒక మహిళ అరుపులు వినిపించటం.. అటువైపుగా వెళితే.. ముగ్గురు యువకులు ఒక అమ్మాయిని రేప్ చేయటాన్ని చూసిన పాల్.. తన అభిమాన నటుడు రజనీ తాజా కబాలి చిత్రంలో మాదిరి.. రేప్ కు పాల్పడుతున్న దుండగులపై పిడిగుద్దులు కురిపించాడు. దుండగులతో పాల్ ఫైట్ చేస్తున్న సమయంలో బాధితురాలి అక్కడి నుంచి తప్పించుకు వెళ్లిపోయింది.

కబాలి మార్క్ పిడిగుద్దులతో చెలరేగిపోయిన పాల్ దెబ్బకు దుండగులు సైతం బెదిరిపోయి పారిపోయారు. ఈ దారుణానికి పాల్పడిన వారి కోసం పాల్.. అతని స్నేహితులు వెతుకుతున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News