• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాక్ గగనతలంలోకి బ్రహ్మోస్...

పాక్ గగనతలంలోకి బ్రహ్మోస్ క్షిపణులు.. భారత్ ఏం చెప్పిందంటే?

By - Tupaki Desk
Update: 2022-08-24 05:31 GMT
కొన్ని తప్పులు పర్లేదు కానీ మరికొన్ని తప్పుల్ని సీరియస్ గా తీసుకోవాల్సిందే. తమ్ముడు తన వాడైనా ధర్మం తప్పకూడదన్న మాటను భారత్ చేతల్లోనూ చూపించింది. క్రమశిక్షణతో పాటు.. అంతర్జాతీయ సమాజంలో ఏళ్లకు ఏళ్లుగా తనకున్న ఇమేజ్ విషయంలో భారత్ ఎలాంటి తప్పులు చేయదన్న విషయాన్ని తాజా చర్యతో మరోసారి స్పష్టం చేసినట్లైంది. ఇటీవల దాయాది పాకిస్థాన్ గగనతలంలోకి బ్రహ్మోస్ క్షిపణులు పొరపాటున వెళ్లటం తెలిసిందే.

ఈ వ్యవహారంపై దాయాది దేశం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మార్చి 9న జరిగిన ఈ ఘటన అనంతరం భారత్ కు పాకిస్థాన్ సమన్లు పంపటంతో పాటు.. తన నిరసనను తెలియజేసింది.

దీనికి స్పందించిన భారత్ పూర్తి విచారణ అనంతరం తాజాగా ముగ్గురు వాయుసే అధికారుల్ని విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్చిలో జరిగిన ఉదంతంపై తాజాగా కేంద్రంలోని మోడీ సర్కారు అధికారిక ఆదేశాల్ని జారీ చేసింది.

విధుల నుంచి తప్పించిన వారిలో ఒక గ్రూప్ కెప్టెన్.. వింగ్ కమాండర్ తో పాటు స్క్వాడ్రన్ లీడర్ కూడా ఉండటం గమనార్హం. స్టాండర్డ్ ప్రొసీజర్స్ లో చేసిన పొరపాటుతో క్షిపణులు ప్రమాదవశాత్తు పాకిస్తాన్ భూభాగంలో పడ్డాయని.. దీనికి ముగ్గురు అధికారులు చేసిన పొరపాట్లే కారణమని విచారణలో తేల్చారు.

అయితే.. ఈ సాంకేతిక లోపంతోనే పాకిస్థాన్ లో పొరపాటున బ్రహ్మోస్ క్షిపణులు పడినట్లుగా పేర్కొంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదన్న విషయాన్ని  వెల్లడించింది. ఏమైనా.. తమ వైపు నుంచి జరిగే తప్పుల విషయంలో ఉపేక్షించమన్న విషయాన్ని భారత సర్కారు తాజా చర్యతో స్పష్టం చేసిందని చెప్పాలి.
Tags:    
  • IAFSacksThreeOfficers 
  • BrahmosMissilesintoPakistan 
  • BJPGovernment 
  • NarendraModi 
  • BrahmosSpyingCase 
  • AccidentiallyFiringBrahmos 

Similar News

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

Copyright @2026

Powered by Blink CMS