ఆంజనేయుడి జన్మస్థలం వివాదంపై స్పందించిన బ్రహ్మానందం
వెండితెరపై ప్రేక్షకులను నవ్వించే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తాజాగా ఓ సీరియస్ అంశంపై తన అభిప్రాయలను వెల్లడించడం చర్చనీయాంశమైంది. ఆంజనేయ స్వామి జన్మస్థలంపై టీటీడీ, కిష్కింధ సంస్థాన్ ట్రస్టు మధ్య వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే.
అయితే ఈ విషయంపై హనుమత్ జన్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతీ తో బ్రహ్మానందం ఓ టీవీచానెల్ లైవ్ లో మాట్లాడారు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. భక్తికి నిదర్శనం ఆంజనేయ స్వామి అని అభివర్ణించారు. ఆంజనేయుడు ఎక్కడ పుట్టారని వివాదం చేయడం ఏమాత్రం సమంజసం కాదని తేల్చిచెప్పారు.
ఆంజనేయుడు ఎక్కడ పుట్టారో అని వాదించుకోవడం కంటే భారతదేశంలో పుట్టారని గర్వపడితే మంచిదని వ్యాఖ్యానించారు. ఆంజనేయుడు అందరివాడని.. దయచేసి వివాదాస్పదం చేయవద్దని బ్రహ్మానందం విజ్ఞప్తి చేశారు.