బొత్స ఇంట్లో విషాదం.. మాతృవియోగం
ఏపీ మంత్రి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. బొత్స సత్యనారాయణ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి ఈశ్వరమ్మ ఈ తెల్లవారుజామున (ఆదివారం) కన్నుమూశారు. గడిచిన నెల రోజులుగా ఆమె అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆమెను విశాఖలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.
ఈ రోజు ఉదయం ఆమె కన్నుమూశారు. ఆమెకు మొత్తం సంతానం పదకొండు మంది కాగా.. అందులో ఏడుగురు కొడుకులు.. నలుగురు కుమార్తెలు ఉన్నారు. మంత్రి బొత్స ఆమె పెద్ద కొడుకు కాగా.. రెండో కుమారుడు బొత్స అప్పల నరసయ్య .తల్లి మరణంతో బొత్స కుటుంబంలో విషాదం నెలకొంది. విశాఖ ఆసుపత్రిలో మరణించిన ఆమె భౌతికకాయనికి అంతిమ సంస్కారాలు విజయనగరంలోని స్వర్ణధామంలో నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. బొత్స తల్లి మరణం గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ తన సంతాపాన్ని తెలియజేశారు.