శభాష్... బోరు బావుల మీటర్ల తాట తీశారు
రైతు అంటే అన్నం పెట్టే అన్న దాత. ఈ ప్రపంచంలో ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. కానీ అవన్నీ స్వార్ధానికే. ఇక ప్రాణాధారమైన ఆహారాన్ని అందించే రైతు చేసేది ఉద్యోగం కానే కాదు అద్భుతమైన మానవసేవ. అలాంటి అన్న దాతల పట్ల ఏలికలు ఎలా ప్రవరిస్తారో అందరికీ తెలిసిందే. పాలసీల రూపకల్పనలో కానీ బడ్జెట్ కేటాయింపులలో కానీ రైతులకు దక్కేదేంటి అంటే జీరో అనే చెప్పాలి.
ఇక ఆ మధ్యన కేంద్రం వ్యవసాయ సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగా మోటార్లకు విద్యుత్ మీటర్లను బిగించాలని కూడా కొత్త నిబంధన తీసుకువచ్చింది. ఇలా కేంద్రం బోరు బావుల వద్ద చేయగా చాలా చోట్ల వాటికి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అంతే కాదు రైతన్న కన్నెర్ర చేస్తున్నాడు. ఇదేమి అఘాయిత్యం అని కూడా మండుతున్నాడు.
దీంతో తాజాగా ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ జిల్లా రైతులు అయితే ఏకంగా మీటర్ల తాట తీసేశారు. తమ పొలాల బావుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ మీటర్లను తొలగించి దేశమంతా శభాష్ అనేలా నిరసన తెలిపారు. ఇదీ తమ ధర్మ పోరాటం అని కూడా చెప్పకనే చెప్పారు. మీటర్లు పెడితే మా బీపీ మీటర్ కూడా పెరిగిపోతుందని హెచ్చరికలు పంపించారు.
అంతా బాగుందని, మీటర్లతో మేలే జరుగుతుందని బీజేపీ నేతలు చెబుతున్న మాటలు ఉత్త గాలి మాటలే అని రైతులు అంటున్నారు. మీటర్ల ఏర్పాటు ఆర్ధికంగా రైతులకు ఇబ్బందులకు గురి చేస్తుందని కూడా వారు చెప్పడం విశేషం.
ఇక ఏపీలో వ్యవసాయ బోర్లకు మీటర్లను పెట్టాలని ప్రభుత్వం చేస్తున్న ఉత్సాహపూరిత ప్రయత్నాలకు కూడా నిరసన వ్యక్తం అవుతోంది. ఇపుడు యూపీ రైతులు చూపించిన బాటలో ఏపీ రైతులు నడిస్తే వైసీపీకి అతి పెద్ద షాక్ తగలడం ఖాయమే అంటున్నారు.
Full View