కూటమి గేట్లు ఓపెన్...వారందరికీ వెల్ కమ్
ఏపీలో కూటమి పాలన నెమ్మదిగా రెండేళ్ళకు చేరువ కావస్తోంది. ఇక పాలన మీద జనాలు తమ ఒపీనియన్ ని ఓపెన్ గా రైజ్ చేసే టైమ్ కూడా స్టార్ట్ అవుతున్న నేపథ్యం ఇదే.;
ఏపీలో కూటమి పాలన నెమ్మదిగా రెండేళ్ళకు చేరువ కావస్తోంది. ఇక పాలన మీద జనాలు తమ ఒపీనియన్ ని ఓపెన్ గా రైజ్ చేసే టైమ్ కూడా స్టార్ట్ అవుతున్న నేపథ్యం ఇదే. మరో వైపు చూస్తే వైసీపీ కూడా 2026 కొత్త ఏడాదిలో తన రాజకీయ యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేసుకుంటోంది. అయితే ఓటమి తరువాత వైసీపీ అయితే పెద్దగా కార్యక్రమాలు చేసినది లేదు, అధినేత జగన్ కూడా జనంలోకి వచ్చినది లేదు, కానీ ఇక మీదట వైసీపీ వెళ్లాలని చూస్తోంది. అయితే వైసీపీ జనంలోకి వెళ్ళి బలపడకుండా ఎత్తులు పై ఎత్తులు వేసేందుకు కూటమి గట్టిగానే స్కెచ్ గీస్తోంది. 2029 లోనూ గెలవాలని చూస్తోంది. అంతే కాదు ఏకంగా 15 ఏళ్ళ పాటు ఏపీలో కూటమి పాలన సాగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక సార్లు చెబుతూ వచ్చారు. అయితే ఇవి కేవలం మాటలు కాదు ఇపుడు చేతలకు టీడీపీ కూటమి దిగుతోంది అని అంటున్నారు.
వైసీపీ వీక్ కావాల్సిందే :
వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రానీయకుండా వీక్ చేయాలని కూటమిలో ప్రధాన పార్టీలు అయిన టీడీపీ జనసేన డిసైడ్ అయ్యాయని అంటున్నారు. ఇందుకోసం తగిన రాజకీయ ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. దీని ప్రకారం పార్టీలు ఎవాఇనా కానీ నాయకులు మంచిగా ఉంటే చాలు, వారు వివాదరహితంగా ఉంటూ ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉంటే కనుక వారిని చేర్చుకోవడానికి టీడీపీ జనసేన సిద్ధం అవుతున్నాయని చెబుతున్నారు. వైసీపీలో బలమైన నాయకులు అనేక మంది ఉన్నారు. వారిని టార్గెట్ చేశారు అని అంటున్నారు.
సైలెంట్ గా ఉన్న వారికి :
ఇక పేరుకు వైసీపీలో ఉన్నా కూడా ఆ పార్టీలో సైలెంట్ గానే అనేక మంది ఉన్నారు. వారు సొంత పార్టీ తీరు పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. అదే సమయంలో తమ రాజకీయ జీవితం మీద కూడా వారు ఆందోళన చెందుతునట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వారి విషయంలో టీడీపీ జనసేన టార్గెట్ చేసి మరీ చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నాయని అంటున్నారు. ప్రజలలో పలుకుబడి ఉండి పనిచేసే తత్వం ఉన్న వారిని చేర్చుకుంటే కూటమి ఒక వైపు మరింతగా బలపడుతుందని అదే సమయంలో వైసీపీ వీక్ అవుతుందని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. దీంతో వైసీపీలో ఈ తరహా నేలత లిస్ట్ ప్రిపేర్ చేస్తూ ఎవరికి వారుగా చేర్చుకునేందుకు టీడీపీ జనసేన పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నాయని అంటున్నారు.
వైసీపీ రాకుండానే :
వైసీపీ ఇపుడు విపక్షంలో ఉంది. ఆ పార్టీ ఏజ్ 15 ఏళ్ళు, గతంలో బలమైన ప్రతిపక్షంగా ఉంది, ఆ తరువాత అధికారంలోకి వచ్చింది. ఇపుడు చూస్తే విపక్షంలో 11 సీట్లు సాధించినా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుంది. దాంతో వైసీపీ మళ్ళీ అధికారంలోకి తప్పకుండా వస్తామని అంటోంది. అయితే ఆ చాన్స్ వైసీపీ ఇవ్వకూడదు అంటే బాగా వీక్ చేయాలన్నది కూటమి పార్టీల రాజకీయ మంత్రాంగం గా ఉందని అంటున్నారు.
వారికి కండువాలతో :
వైసీపీ నుంచి వచ్చే నాయకులకు స్వాగతం పలకాలన్నది సూత్రప్రాయంగా నిర్ణయించారు అని అంటున్నారు. రాజకీయంగా వైసీపీని ఈ విధంగా దెబ్బ తీయాలని కూడా ఆలోచిస్తున్నారు. అందుకే ఏ ప్రాంతం అని కానీ ఏ నియోజకవర్గం అని కానీ ఏ జిల్లా అని కానీ చూడకుండా బెస్ట్ లీడర్ జనంలో ఎంతో కొంత పేరుంది అని కనుక రిపోర్టు ఉంటే చాలు వారికి ఎర్ర తివాచీ పరచి వెల్ కం చెబుతారు అని అంటున్నారు. ఇది ఒక విధంగా వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలకు మంచి అవకాశంగా చెబుతున్నారు. అయితే వైసీపీకి మాత్రం అగ్ని పరీక్షగా పేర్కొంటున్నారు. ఈ భారీ రాజకీయ సవాల్ కూటమి నుంచి ఎదురైతే వైసీపీ ఎలా తట్టుకుంటుంది అన్నది కూడా పెద్ద చర్చగా ఉంది.
న్యూట్రల్ లీడర్స్ తో :
అంతే కాదు ఏ రాజకీయ పార్టీకి చెందని న్యూట్రల్ లీడర్స్ ని కూడా తమ పార్టీలలో చేర్చుకోవడం ద్వారా వైసీపీ గ్రాఫ్ ఏ మాత్రం పెరగకుండా చెక్ పెట్టాలని టీడీపీ జనసేన వ్యూహ రచన చేస్తున్నాయని అంటున్నారు. ఎన్నికలు చూస్తే ఇంకా మూడేళ్ళకు పై దాటి ఉన్నాయి కానీ ఇప్పటి నుంచే తమ పొలిటికల్ యాక్షన్ అమలు చేయాలని కూటమి పార్టీలు డిసైడ్ కావడం అయితే రాజకీయంగా ప్రకంపనలు రేపేలా ఉందనే అంటున్నారు.