తెలంగాణలో మాదిరి ఏపీలో బీజేపీ వేవ్? ఏం చెప్పారంటే?
గ్రేటర్ ఎన్నికల్లో అంచనాలకు మించి బీజేపీకి వచ్చిన డివిజన్ల సంఖ్య కొత్త చర్చకు తెర తీసింది. తెలంగాణలో ఏ రీతిలో అయితే బీజేపీ తన సత్తా చాటిందో ఏపీలోనూ కమలం వికసిస్తుందన్న మాట ఎక్కువైంది. ఇందులో నిజం ఎంత? అన్న విషయంపై తాజాగా ఆన్ లైన్ లో ఒక పోల్ నిర్వహించారు. ఇందులో వచ్చిన ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తం 65980 ఓట్లు పోల్ అయితే.. 67.90 శాతం మంది అంటే.. 44800 మంది ఏపీలో ప్రభావం చూపించదని తేల్చేశారు. అదే సమయంలో.. ప్రభావం చూపుతుందన్న వారు కూడా లేకపోలేదు.
ఇలాంటి వారెంతమంది ఉన్నారన్నది చూస్తే.. 27.30 శాతంగా తేలింది. ఓట్ల రూపంలో చూస్తే 18,010 మంది తెలంగాణలో మాదిరి ఏపీలో బీజేపీ పట్టు పెరుగుతుందన్న వాదనకు ఓటేశారు. ఇక.. తాము ఏమీ చెప్పలేమని చెప్పినోళ్లు 4.80 శాతం మంది ఉన్నారు. నిజంగానే..ఏపీలో బీజేపీ అంత ప్రభావాన్ని చూపుతుందా? అన్న విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తే.. తెలంగాణ రాజకీయాలకు.. ఏపీ రాజకీయాలకు తేడా ఉందన్నది మర్చిపోకూడదు.
తెలంగాణ రాజకీయాల్ని హైదరాబాద్ అంతో ఇంతో ప్రభావితం చేస్తుంది. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో (మహేశ్వరం కలుపుకొని) మజ్లిస్ ప్రాతినిధ్యం వహించే 7 నియోజకవర్గాల్ని తీసివేస్తే.. 17 నియోజకవర్గాల ప్రభావం తెలంగాణ రాజకీయాల్ని ప్రతిబింబించేలా ఉంటుందన్నది మర్చిపోకూడదు. ఎందుకంటే.. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన వారు హైదరాబాద్ లో భారీగా ఉంటారన్నది మర్చిపోకూడదు.
మరో కీలక అంశం ఏమంటే.. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ లేకపోవటం. టీడీపీ.. కాంగ్రెస్ పార్టీల ఉనికిని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నార్థకం చేయటంతో ఆ ఖాళీని భర్తీ చేయటానికి బీజేపీ అవసరం అనివార్యమైంది. ప్రజలు సైతం అధికారపార్టీకి ప్రత్యామ్నాన్ని చూసినప్పుడు వారికి కనిపించేది బీజేపీనే. ఇది కూడా ఒక కారణంగా చెప్పాలి. ఏపీ రాజకీయాల్ని చూస్తే.. కులం ఆధారంగా జరిగే రాజకీయం ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు.. హైదరాబాద్ లాంటి ఒక మహానగరం.. ఆ నగరం మొత్తం ఏపీని ప్రభావితం చేసేదేమీ లేకపోవటం మరో కారణం.
అన్నింటికి మించి.. ఏపీలో అధికారపార్టీకి రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. బలమైన విపక్షంగా టీడీపీ (ప్రస్తుతానికైతే బలహీనంగా ఉందనుకోండి. ఎన్నికల నాటిని దూకుడు ప్రదర్శించే వీలుంది).. ఉనికి పెద్దగా లేకున్నా.. క్రౌడ్ ఫుల్లింగ్ చేసే పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన ఉండనే ఉన్నాయి. ఇలాంటివేళ.. బీజేపీకి అవకాశం లభించటం కష్టమే అవుతుంది. తెలంగాణలో బీజేపీతో చట్టాపట్టాలు వేసుకోవటానికి జనసేన ఉత్సాహాన్ని ప్రదర్శించినా.. బీజేపీ నో చెప్పింది.
అలాంటి కమలం పార్టీ ఏపీలో జనసేనతో చెట్టాపట్టాలేసుకొని తిరిగేందుకు తెగ ఉత్సాహాన్ని ప్రదర్శించటాన్ని మర్చిపోలేం. ఎందుకంటే.. ఏపీలో జనసేనకు ఉన్నంత ఫాలోయింగ్ కూడా బీజేపీకి లేదు. ఈ కారణంతోనే పవన్ తో కలిసి నడవటానికి బీజేపీ నేతలు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటివన్ని చూసినప్పుడు తెలంగాణలో మాదిరి ఏపీలో బీజేపీ తన సత్తా చూపే అవకాశం ఇప్పటికే కాదు.. రానున్న కొన్నేళ్లలో సాధ్యం కాదు. ఎందుకంటే.. అధికారపార్టీ మీద ప్రజల్లో ఉన్న పలుకుబడి కూడా కారణమని చెప్పక తప్పదు.