బీజేపీకి ఏడు సీట్ల కంటే అక్క‌డ‌ మించ‌వ్‌!

Update: 2022-01-05 10:31 GMT
ఉట్టికెగ‌ర‌లేన‌మ్మ‌.. స్వ‌ర్గానికి ఎగురుతాను.. అన్న‌ట్టుగా ఉంద‌ట బీజేపీప‌రిస్థితి. తెలంగాణ‌లో బీజేపీని ప‌రిశీ లిస్తున్న వారు.. ఇవే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. క్షేత్ర‌స్థాయిలో పునాదులు బ‌లంగా లేక‌పోయినా.. బీజేపీ మాత్రం ఎగిరెగిరి ప‌డుతోంద‌ని అంటున్నారు. ఇలా అయితే.. క‌ష్ట‌మేన‌ని కూడా చెబుతున్నారు. విష‌యం లోకి వెళ్తే.. 2018లో తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఈ ఎన్నిక‌ల్లో రాస్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేసింది. అయితే.. 100 స్థానాల్లో బీజేపీ అస‌లు డిపాజిట్లు కూడా ద‌క్కించుకోలేక పోయింది.

అయితే.. 2019 పార్ల‌మెంటు ఎన్నిక‌ల స‌మ‌యానికి కొంత పుంజుకుంది. అటు ప్ర‌ధాని మోడీ వేవ్ స‌హా.. రాష్ట్రంలోనూ సానుకూల ప‌రిస్థితి వంటివి క‌లిసి వ‌చ్చింది. దీంతో 4 పార్ల‌మెంటు స్థానాల్లో బీజేపీ గెలుపు గుర్రం ఎక్కింది. దీనికి మ‌రో కార‌ణం కూడా క‌లిసి వ‌చ్చింది. అది అధికార‌పార్టీ టీఆర్ ఎస్ ఓవ‌ర్ యాక్ష‌నే న‌ని అంటున్నారు. ఇదిలావుంటే, గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఏదో ప్ర‌జ‌ల‌ను ఊరించారు. లేనిపోని హామీలు గుప్పించారు. ఇంకేముంది.. కేంద్రం నుంచి నిధులు తీసుకువ‌స్తామ‌ని.. హైద‌రాబాద్‌ను మ‌హోగ్రంగా అభివృద్ది చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

దీంతో ఇక్క‌డి ప్ర‌జ‌లు న‌మ్మి బీజేపీకి 40కి పైనే కార్పొరేట‌ర్ల‌ను క‌ట్ట‌బెట్టారు. అయితే.. య‌థాలాపంగానే .. బీజేపీ త‌న హామీల‌ను త‌నే మ‌రిచిపోయింది. ఎవ‌రు ప్ర‌శ్నించినా.. దీనిపై స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. దాదాపు 85 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది. క‌నీసం పార్టీని న‌డిపించేవారు.. జెండాను ప‌ట్టుకునేవారు కూడా క‌నిపించ‌డం లేదు.

ఇక‌, గ్రామీణ ప్రాంతాల్లో అయితే.. అస‌లు కేడ‌ర్ కూడా లేకుండా పోయింది. అంటే.. క్షేత్ర‌స్థాయిలో క‌మ‌ల నాథులు ఎంత బ‌ల‌హీనంగా ఉన్నారో.. అర్ధం అవుతుంది.

అదేస‌మ‌యంలో పార్టీని డెవ‌ల‌ప్ చేస్తామ‌నే నాయ‌కుల క‌న్నా.. ఓవ‌ర్ యాక్ష‌న్ చేసేవారే ఎక్కువ‌గా ఉండ డం గ‌మ‌నార్హం. మీడియా ముందుకు రావ‌డం.. చెడా మ‌డా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసేయ‌డం.. సైలెంట్ అయిపోవ‌డం త‌ప్పితే.. వీరివ‌ల్ల పార్టీకి ఏమీ లాభం క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ నేప‌థ్యంలో తాజాగా నిర్వ‌హించిన ఒక స‌ర్వేలో సంచ‌ల‌న విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది.

అదేంటంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ 119 స్థానాల్లోనూ పోటీ చేసినా.. కేవ‌లం 45 స్థానాల్లో మాత్రమే డిపాజిట్లు వ‌స్తాయ‌ని తేలిపోయింది. కేవ‌లం 7 స్థానాల్లో మాత్ర‌మే బీజేపీ గెలుపు గుర్రం ఎక్కుతుంద‌నే అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి దీనిని బ‌ట్టి క‌మ‌ల నాథుల రేంజ్ ఏంటో అర్ధ‌మ‌వుతోంద‌ని స‌ర్వే తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News