బీజేపీ షికారా ర్యాలీలో అపశృతి .. లేహ్‌ సరస్సులో పడవ బోల్తా !

Update: 2020-12-14 05:20 GMT
జమ్ముకశ్మీర్‌ లో డిస్ట్రిక్ట్‌ డెవలప్‌ మెంట్‌ కౌన్సిల్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తమకి అపూర్వ విజయాన్ని అందించాలని కోరుతూ విన్నూతనంగా ప్రచారం చేపట్టారు. అయితే , ఆ ప్రచార సమయంలో అపశృతి చోటుచేసుకుంది. ఆ అపశృతి నుండి స్థానికుల సహాయం తో ప్రాణాలతో బయటపడ్డారు. అసలేమైంది అంటే ...

జమ్ముకశ్మీర్ ‌లో డిస్ట్రిక్ట్‌ డెవలప్‌ మెంట్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో భాగంగా  .. గడ్డకట్టే చలిలో  లేహ్‌ సరస్సులో షికారా ర్యాలీ ప్రారంభించారు బీజేపీ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు పడవల్లో బయలుదేరారు . టూరిస్టులను ఆకట్టుకునేందుకు ఇదో  కొత్త తరహా క్యాంపెయిన్‌. పంచాయతీ ఉప ఎన్నికలతో పాటు ఆరో దశలో 31 డీడీసీల ఎన్నికలున్నాయి. మొత్తం 8దశల్లో జరగనున్న ఎన్నికల ఫలితాలు ఈనెల 22న రాబోతున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ప్రచారంలో భాగంగా షికారా ర్యాలీ నిర్వహించింది.

కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలో బీజేపీ నేతలు పడవల్లో దాల్‌ సరస్సులో విహరిస్తూ ప్రచారం చేశారు. కశ్మీర్ ‌లో శాంతికోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకి విజ్ఞప్తి చేశారు. ప్రచారం చివరి దశలో మళ్లీ ఒడ్డుకు చేరుతుండగా షికారా ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. ఒడ్డుకు చేరువలోనే ఓ పడవ బోల్తాపడింది. దీంతో నాయకులతో పాటు మీడియా ప్రతినిధులు కూడా సరస్సులో పడిపోయారు. ప్రమాదం జరగ్గానే స్థానికులతో పాటు ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అందరినీ రక్షించారు. నలుగురు నేతలతో పాటు నీళ్లలో పడ్డ పాత్రికేయులను ఒడ్డుకు చేర్చారు. కొన్ని మీడియా కెమెరాలు నీటిపాలయ్యాయి. కొత్త తరహా ప్రచారం లో అపశృతి చోటు చేసుకోవడంతో అందరూ ఆందోళనకి గురైయ్యారు. అయితే , అందరూ కూడా ప్రాణాలతో బయటపడటంతో కొంచెం టెంక్షన్ అయితే తగ్గింది. 
Tags:    

Similar News